తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్ర బాబు నాయుడులు, దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లారు.
ఈ నెల 20 నుండి 24 వరకు ఈ సదస్సు జరుగుతుంది. చంద్రబాబు వెంట లోకేష్ కూడా వెళ్లారు. పరిశ్రమల శాఖా మంత్రి టి జి భరత్ కూడా చంద్రబాబుతో వెళుతున్నారు. మరోపక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళుతున్నారు
చంద్రబాబు రాష్ట్ర పాలసీలు, పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాల గురించి ఈ సదస్సులో మాట్లాడనున్నారు. మరోపక్క గత ఏడాది 40 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చినట్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. మరోపక్క తెలంగాణ రైజ్ పేరుతో రేవంత్ రెడ్డి కూడా పెట్టుబడిదారులను అక్షర్శించే ప్రయత్నం చేస్తారు
చంద్ర బాబు అయినా, రేవంత్ రెడ్డి అయినా ముఖ్యంగా ఐటి, ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా రంగాల పై దృష్టి సారించనున్నారు.
పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ఈ సదస్సుకు వెళ్లారు. గురు, శిష్యులలో ఎవరు, ఎక్కువ పెట్టుబడులు తెస్తారో చూద్దాం
నాలుగు రోజులలో కనీసం 10 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవ్వాలని, వీలైనంత భారీగా పెట్టుబడులు సమీకరించాలని ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోచిస్తున్నారు. ఈ పెట్టుబబడుల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు, ఎప్పటికప్పుడు ప్రజలకు, అప్డేట్ చేస్తూ ఉండాలి.
అల్ ది వెరీ బెస్ట్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు

