నాగ్ అశ్విన్ 10 ఏళ్ళ సినీ ప్రస్థానం స్పెషల్ వీడియో

by | Mar 21, 2025 | సినిమా

ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ 10 ఏళ్ళ సినీ ప్రస్థానం పై వైజయంతి మూవీస్ స్పెషల్ వీడియో ని విడుదల చేసింది

నాగ్ అశ్విన్ పరిచయం అక్కర్లేని పేరు. మొదటి సినిమా 2015 లో విడుదలైన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’. క్రిటిక్స్ ప్రశంసలను అందుకుంది ఈ చిత్రం.  ఆ తరవాత 2018 లో వచ్చిన మహానటి తో నాగ్ అశ్విన్ పేరు మరు మ్రోగిపోయింది.  మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించింది.  ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో తెరకెక్కిన బయోపిక్ ల మహానటి మొదటి స్థానంలో ఉంటుంది.  క్లీన్ అండ్ వెల్ మేడ్ బయోపిక్ అఫ్ తెలుగు సినిమా అని అందరు ప్రశంసించారు

ఆ తరవాత ప్రభాస్, దీపికా పడుకునే, అమితాబ్ బచ్చన్ లతో తీసిన కల్కి జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది.  10 ఏళ్ళ ప్రస్థానం లో 3 సినిమాలకు దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్.  నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి పార్ట్ 2 ని తెరకెక్కించే పనులలో ఉన్నారు