రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడుగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కింగ్డమ్'(Kingdom). ఇందులో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోండగా.. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కనిపిస్తారని తెలిసింది. అలాగే విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో విభిన్న కోణాలు ఉంటాయట. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 30న విడుదల చేయనున్నట్లుగా ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్, టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా, అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన లభించింది.
తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టీజర్ కు ఉహించని స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ టీజర్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రీట్ కి చిత్ర బృందం టైం ఫిక్స్ చేశారు. మార్చి 17న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి ఈ టీజర్ మ్యూజిక్ ట్రాక్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దింతో ఇప్పుడు రౌడీ హీరో ఫ్యాన్స్ ఆ టీజర్ ట్రాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

