మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాల ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. కమెడియన్ సత్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇండో–కొరియన్ హారర్ బ్యాగ్డ్రాప్ లో రానున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్లో 15వ చిత్రంగా రానుంది. అయితే జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్ తో పాటుగా టైటిల్ ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanaka Raju) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ఈ గ్లింప్స్‌లో కొరియన్ పోలీస్ స్టేషన్లో సత్యని కట్టేసి ఉండగా.. అక్కడికి వచ్చిన వరుణ్ తేజ్ పోలీసుల్ని చంపేస్తాడు. అయితే వరుణ్ ను ఓ దెయ్యం పీడిస్తూ ఉంటుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ గ్లింప్స్ అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
కాగా, ఈ ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ని విజయవంతంగా ఈ సినిమా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. వరుణ్ తేజ్‌తో (Varun Tej) పాటు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కెరీర్ ఆరంభంలో వరుస హిట్స్ అందుకున్న వరుణ్ తేజ్ గత మూడు సినిమాలతో దారుణంగా నిరాశపరిచాడు. మరి మేర్లపాక గాంధీతో (Merlapaka Gandhi) చేస్తున్న ఈ మూవీ వరుణ్ తేజ్ రాత మారుస్తుందా లేదా చూడాలి.

