రాజాసాబ్ ఫలితం ప్రభాస్ ముందే ఊహించాడా ; ది రాజాసాబ్ సర్కస్ 1935 ఉంటుందా?
ది రాజాసాబ్ చిత్రం జనవరి 9 న విడుదలయింది. జనవరి 8 న ఆంధ్రలో ప్రీమియర్స్ కూడా వేశారు. రాజాసాబ్ సినిమాకు రివ్యూస్ మిశ్రమంగా ఉన్నాయి. ప్రభాస్ అభిమానులను సైతం ది రాజాసాబ్ సినిమా మెప్పించలేకపోయిందని కొంతమంది అభిమానులు అంటున్నారు.
కామెడీ సన్నివేశాలలో, ఎమోషనల్ సన్నివేశాలలో ప్రభాస్ అద్భుతంగా నటించాడు అని తెలుస్తోంది. అయితే దర్శకుడు మారుతి స్క్రీన్ ప్లే , దిరెచ్తిఒన్ ఘోరంగా ఉన్నాయని అంటున్నారు. మారుతికి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం లేదు. అలాంటిదే ఒకే సారి ఇండియాలోనే నెంబర్ వన్ హీరో అయిన ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.
ఆ అవకాశాన్ని చేజేతులా పాడి చేసుకున్నాడని కొందరి అభిప్రాయం. సినిమాకు 400 కోట్లకు పైగా ఖర్చు చేసారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ చెప్పాడు. అనుకున్న బడ్జెట్ ఒకటి. అయిన బడ్జెట్ ఒకటి . ఈ విషయంలో ప్రొడ్యూసర్ ధైర్యాన్ని అభినందించాడు.
ది రాజాసాబ్ చివరలో ది రాజాసాబ్ సర్కస్ 1935 అని కొనసాగింపు చిత్రాన్ని ప్రకటించాడు దర్శకుడు మారుతి. ది రాజాసాబ్ కి వచ్చిన నెగటివ్ రివ్యూస్ ని బట్టి చూస్తే రెండవ పార్ట్ ఉంటుందా అనే అనుమానం వస్తోంది. ప్రభాస్ కూడా వరస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. స్పిరిట్, Fouji, సలార్-2, కల్కి-2 చిత్రాలతో ప్రభాస్ వచ్చే రెండు, మూడేళ్లు ఖాళీగా ఉండడు.
ది రాజాసాబ్ ఫలితాన్ని ప్రభాస్ ముందే ఊహించాడా. అందుకేనా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సంక్రాంతి సినిమాలన్నీ సూపర్ హిట్ అవ్వాలి అందులో మా సినిమా కూడా హిట్ అయితే ఇంకా హ్యాపీ అని అన్నాడు. మా సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ అన్నప్పుడే అందరికి అనుమానాలు వచ్చాయి
ది రాజాసాబ్ కు ఏమాత్రం వసూళ్లు వచ్చిన అది కేవలం ప్రభాస్ స్టామినాకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ సినిమా పరాజయానికి దర్శకుడు మారుతి పూర్తి బాధ్యత తీసుకోవాలి. దర్శకుడు మారుతి ఏమనుకొని ఈ సినిమా మొదలెట్టాడో, ఏమి తీశాడో అతనికే తెలియాలి. వీటన్నింటికి తోడు మారుతి ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన ఇంటి అడ్రస్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం, థమన్ నేపధ్య సంగీతంపైనా కూడా విమర్శలు వస్తున్నాయి
ప్రభాస్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులను పెట్టుకుని, విచ్చలవిడిగా ఖర్చు పెట్టగలిగే విశ్వప్రసాద్ ని పక్కన పెట్టుకుని దర్శకుడి మారుతి తీసిన సినిమా ఇదేనా….?
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ కి పెద్ద సినిమాలు కలిసి రావడం లేదు. ది రాజాసాబ్ ఫలితం చూసాక కూడా నిర్మాత విశ్వప్రసాద్ ‘ది రాజాసాబ్ సర్కస్ 1935’ కు ముందుకు వస్తాడా అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి

