‘తండేల్’ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్.. అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

by | Mar 8, 2025 | సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించిన సినిమా ‘తండేల్’. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఫిబ్రవరి 7న విడుదలైన సంగతి తెలిసిందే. తొలి రోజు ‘తండేల్’ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సఫీస్ వద్ద ఆదరగొట్టింది. ఈ క్రమంలోనే తండేల్‌ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరి నాగ చైతన్య కెరీర్‌లో వంద కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం తెలుగుతో పాటు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇదిలావుంటే.. తాజాగా ‘తండేల్’ (Thandel సినిమా ఇప్ప‌టివ‌ర‌కు సాధించిన ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌ని చిత్ర‌ యూనిట్ తాజాగా వెల్ల‌డించింది. ఈ సినిమా రూ. 115 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. కాగా, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలవ్వగా… మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఈ సినిమాలో కరుణాకరన్, దివ్య పిళ్లై, జబర్దస్త్ మహేష్ కీలకపాత్రల్లో అలరించారు. కాగా, ఈ సినిమాలోని బుజ్జి తల్లి సాంగ్ ను ఇటీవల రిలీజ్‌ చేసిన చిత్రబృందం తాజాగా బుజ్జితల్లి సాడ్‌ వర్షన్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకుల గుండెల్ని మెలిపెడుతోంది.