ఇటీవల ప్రధాన మంత్రి మోడీ ని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు ప్రధాని మోడీ.
సాధారణంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు ప్రధానికి విన్నవించుకుని నిధులు తెచ్చుకోవడం కోసం ప్రధానిని కలిస్తారు. అయితే ఇది భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక విధంగా, మిగతా ముఖ్యమంత్రులకు ఒకలా ఉంటుంది. మిగతా ముఖ్యమంత్రులలో ముఖ్యంగా భాజపా ని, ప్రధాని మోడీ ని తరచూ విమర్శించే ముఖ్యమంత్రులకు ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది
అవకాశం దొరికినప్పుడల్లా ప్రధానిపై, భాజపా పై విరుచుకు పడే రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి ప్రధాని మోడీ గూగ్లి వేశారు.
రేవంత్ రెడ్డి ప్రధానిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు
రీజినల్ రింగ్ రౌండ్ సౌత్ పనులు పూర్తి చేయడానికి నిధులు, ఈ రీజినల్ రింగ్ రోడ్ కు సమానంగా రైల్వే రింగ్ వంటి పలు అంశాలు ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోయే మూసి ప్రక్షాళనకు కావలసిన నిధులు, మెట్రో రైల్ రెండవ ఫేజ్ కు కావలసిన నిధులు వంటి పలు నిధులతో ముడిపడి ఉన్న అంశాలను రేవంత్ రెడ్డి ప్రధాని ముందు ఉంచారు. ఇవే కాకుండా హైదరాబాద్ ఊరి చివర డ్రై ఫోర్ట్, బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, తెలంగాణకు మరి కొంతమంది ఐపీఎస్ లను కేటయించే విషయం తో పాటు, మురుగు నీటి శుద్ధి కేంద్రాల గురించి ప్రధానిని సంప్రదించారు రేవంత్ రెడ్డి
ఇక్కడే ప్రధాని మోడీ, రేవంత్ రెడ్డి కి గుగ్లీ వేశారు. రేవంత్ చిట్టా విన్నాక ప్రధాని తన చిట్టా విప్పారు. ప్రధాని ఆవాస్ యోజన గ్రామీణ పధకం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి. వచ్చే మార్చ్ 31 నాటికి అర్హులైన వారందరి జాబితా తయారు చేయాలి. నిధులు లేవని నిధుల కోసం వెళితే ప్రధాని రాష్ట్ర వాటా నిధులను రేవంత్ రెడ్డి ని అడిగారు. అంతే కాకుండా పెండింగ్లో ఉన్న నీటి పారుదల ప్రాజెక్ట్ ల అంచనాలను సవరించి పంపాలి అని రేవంత్ రెడ్డి కి సూచించారు. మావోయిస్టు ప్రాంతాలలో రోడ్లకు అనుమతులు, రైల్వే ప్రాజెక్ట్ కు అటవీ అనుమతులు కూడా ఇవ్వాలని రేవంత్ రెడ్డి కి సూచన చేశారు ప్రధాని మోడీ(Narendra Modi). అంతే కాకుండా శంషాబాద్ ESI నిర్మాణానానికి సంబంధించి 150 కోట్లు, బి బి నగర్ ఎయిమ్స్ కు సంబంధించి 1365 కోట్ల రాష్ట్ర వాటాలను కూడా చెల్లించాలి అని సూచన చేశారు.
అందుకే అందరితో గొడవలు పడకుండా, విమర్శలు చేయకుండా మంచిగా రాష్ట్రానికి కావలసిన నిధులు తెచ్చుకోవాలి. లేదంటే ఇలాంటి గూగ్లీ లను పేస్ చేయాలి. క్రికెట్ లో గూగ్లీ లను ఫేస్ చేయడం అంటే అవుట్ అవడమే లేదంటే అదృష్టవశాత్తు డిఫెన్సె చేయడం.
ప్రధాని మోడీ (Narendra Modi) నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని ఆవాస్ గ్రామీణ యోజన (PM Awas Gramina Yojana) పధకం అమలు చేయాలనీ రేవంత్ (Revanth) కు కండిషన్ పెట్టారు. అంతే కాకుండా మావోయిస్టు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే ప్రాజెక్ట్ కు అటవీ అనుమతులు, నీటి పారుదల ప్రాజెక్ట్ కు నిధులు వంటి అంశాలన్నీ భాజపా తెలంగాణాలో ప్రమోట్ చేసేలా ఉంటాయి.
ఢిల్లీ మాదిరి డబల్ ఇంజిన్ సర్కారు మంత్రం తో తెలంగాణ (Telangana) లో కూడా భాజపా రంగంలో దిగవచ్చు.
ముందు, ముందు ఏం జరుగుతుందో చూడాలి. ఏం ఎల్ సి ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి. బి ఆర్ ఎస్ దూరంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, భాజపా ల మధ్యే ఉంది

