శ్రీనివాస్ రెడ్డి గారు, వర్మ గారు కూటమి ధర్మం పాటించరా..??!

by | Jan 19, 2025 | రాజకీయాలు

కూటమి ప్రభుత్వం, ఏర్పాటై అభివృద్ధి పరుగులు పెడుతున్న ఈ తరుణం లో,  లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలి అని తెలుగు దేశం పార్టీ లో కొంత మంది నాయకులు శ్రీనివాసులు రెడ్డి, పిఠాపురం వర్మ, అంటున్నారు.  ఇది తెలుగు దేశం పార్టీ వారి కొత్త పాట.  ఒకళ్ళు మాట్లాడితే, ఈ పాటను అందరు పాడతారు రాబోయే రోజుల్లో.  

శ్రీనివాసులు రెడ్డి, వర్మ గారు కూటమి ధర్మాన్ని మర్చి పోయినట్టున్నారు.

చంద్రబాబు నాయుడు జైలు కు వెళ్ళినప్పుడు, తెలుగు దేశం పార్టీ నాయకులందరూ, జైలుకు వెళ్లి, తెలుగు దేశం పార్టీ ని లోకేష్ బాబు, మన పార్టీ ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు నడిపిస్తారన్న భరోసా చంద్రబాబు నాయుడు కు ఎందుకు ఇవ్వలేకపోయారు

మీ లోకేష్ మీద అంత నమ్మకం ఉంటె వైస్సార్సీపీ ని మీరు సొంతం గా ఎందుకు ఎదుర్కోలేకపోయారు

తెలుగు దేశం పార్టీ సొంత గా గెలవలేక, గతి లేక, కూటమి తో, అధికారం లోకి, వచ్చాక, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండగా, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న కూని రాగాలు ఎందుకు శ్రీనివాస్ రెడ్డి గారు, వర్మ గారు

కరడుగట్టిన తెలుగు దేశం కార్యకర్తలుగా మీరు లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చూడాలి అనుకున్నప్పుడు, కరడుగట్టిన జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడాలి అనుకోరా.  పవన్ కళ్యాణ్ వచ్చాకే తెలుగు దేశం పార్టీ నేతలలో ధైర్యం వచ్చింది.  ఆ విషయం మరచిపోకండి

లోకేష్ పై అంత నమ్మకం ఉంటె, లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయాలని అనుకుంటే, ఇప్పుడే, జనసేనతో పొత్తు విరమించుకుని, బీజేపీ తో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతాను అని మీ నాయకుడు చంద్ర బాబు నాయుడు తో చెప్పించగలరా.  మీకు మీరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగినప్పుడు, అప్పుడు, మీ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేసుకుంటారా, లేదా సీఎం చేసుకుంటారా అనేది మీ ఇష్టం. 

అంతే గాని కూటమి ప్రభుత్వం అధికారం లో ఉన్నపుడు, కూటమి ధర్మం మరచిపోయి, సన్నాయి నొక్కులు నొక్కకండి

ఈ కూని రాగాలు తీయకండి.  కరడు గట్టిన మీ అభిమానం, పార్టీ ని సొంతంగా అధికారంలోకి తీసుకురాలేనప్పుడు, ఈ కూని రాగాలు ఎందుకు సార్