సల్మాన్ ‘సికందర్‌’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్

by | Mar 22, 2025 | సినిమా

బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో వ‌స్తున్న తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం త‌ర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ మూవీ రానుండ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. 2025లో రిలీజ్ కానున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ‘సికందర్’ (Sikindar) ఒకటి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ని వదిలారు. మార్చి 23న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. ఓ రొమాంటిక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

కాగా, ఈ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సల్మాన్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక (Rashmika ) మందన్నా నటిస్తోంది. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తుండగా.. రంజాన్ కానుకగా మార్చి 30న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యారు. ఇక గత కొంత కాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తుందని సల్మాన్ (Salman Khan) అభిమానులు ఆశిస్తున్నారు.