మెగా డాటర్ ‘రాకాస’ గ్లింప్స్‌ వచ్చేసింది

by | Jan 23, 2026 | సినిమా

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రానికి మెగా డాటర్ నిహారిక (Niharika) నిర్మాతగా వ్యవహరిస్తోంది. అంతకుముందు కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకుంది నిహారిక కొణిదెల. ఈసారి ‘రాకాస (Rakasa) ’తో కూడా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. నయన్‌సారిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్‌ విద్యార్థి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

హారర్ కామెడీ బ్యాగ్డ్రాప్ లో రానున్న ఈ చిత్రానికి అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందిస్తున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్ 3న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ చూస్తుంటే.. హీరో సంగీత్ శోభన్.. ఓ భయానక ప్రదేశంలో చిక్కుకుంటాడు. ఆ క్ర‌మంలోనే అక్క‌డ ఏం జ‌రిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. ఇక మ్యాడ్ ఫ్రాంచైజీ తరహాలోనే వ‌న్ లైన‌ర్స్ కామెడీతో సంగీత్ ఇందులో కూడా న‌వ్వించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.