ఓ టి టి పార్టనర్ ని లాక్ చేసుకున్నRRR Behind & Beyond

by | Dec 25, 2024 | సినిమా

ఆర్ ఆర్ ఆర్, ఒక గ్లోబల్ సెన్సేషన్ అని చెప్పచు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు గ్లోబల్ ఇమేజ్ తీసుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే.  ఆర్ ఆర్ ఆర్ లో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.

జపాన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం తో రాజమౌళి కి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. సుప్రసిద్ధ దర్శకులు జేమ్స్ కామెరాన్ సైతం ఆర్ ఆర్ ఆర్ సినిమాను ప్రశంసించాడు

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించిన తెర వెనుక విషయాలను,  ‘RRR Behind & Beyond’ పేరుతో ఒక డాక్యుమెంటరీ ని రూపొందించారు.  ఈ డాక్యుమెంటరీ కొన్ని సెలెక్టెడ్ థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఇప్పు ఈ డాక్యుమెంటరీ ని, ప్రముఖ ఓ టి టి సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ నెల 27 నుండి ప్రదర్శించబోతోంది

తారక్, రామ్ చరణ్ అభిమానులకు ఇది ఖచ్చితంగా శుభవార్త