‘పెద్ది’ Vs ‘లెనిన్’.. బాక్సాఫీస్ బరిలో నిలిచేదెవరు?

by | Feb 1, 2026 | సినిమా

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పెద్ది’ (Peddi) . జాన్వీ కపూర్‌ (Jhanvi Kapoor) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శివరాజ్‌కుమార్‌, జగపతిబాబు, దివ్యేందుశర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchibabu) సానా రూపొందిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూర్తిస్థాయి మాస్ రోల్ లో కనిపించనున్నాడనే న్యూస్ ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే విడుదలైన అప్డేట్స్, పోస్టర్లు సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేస్తామని గతంలో చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. కానీ తాజా సమాచారం ప్రకారం పెద్ది మూవీ షూటింగ్ ఇంకా పూర్తవకపోవడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మెరుగైన నాణ్యత కోసం ఇంకాస్త సమయం తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’ (Lenin) . రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వ‌హిస్తుండ‌గా సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) బ్యానర్లపై అక్కినేని నాగార్జున (Nagarjuna) , నాగ వంశీ కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాను మే 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ‘ఏజెంట్’ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో మే 1వ తేదీన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా, అఖిల్ ‘లెనిన్’ చిత్రాల మధ్య బాక్సాఫీస్ మధ్య గట్టి పోటీ ఏర్పడే అవకాశముంది. అయితే రామ్ చరణ్, అఖిల్ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉన్న కారణంగా వీరిద్దరూ కలిసి విడుదల తేదీపై చర్చించుకునే అవకాశముంది. ఒకవేళ ‘పెద్ది’ (Peddi) సినిమాను కనుక మే 1న విడుదల చేయాలి అనుకుంటే, అఖిల్ తన ‘లెనిన్’ (Lenin) చిత్రాన్ని కొన్ని రోజులు వాయిదా వేసుకునే అవకాశముందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.