థియేటర్లలో ‘పెద్ది’ గ్లింప్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు క్రేజీ ట్రీట్‌

by | Apr 2, 2025 | సినిమా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా, షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.

అయితే ఈ సినిమా గ్లింప్స్‌ వీడియోను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 6న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ (Peddi) గ్లింప్స్‌ థియేటర్స్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ ఏప్రిల్ 6న గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఏప్రిల్ 10న థియేటర్స్ లో విడుదల కాబోతున్న మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు ‘జాట్’ అలాగే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో కలిసి థియేటర్లలో స్క్రీనింగ్‌ కాబోతుందని ఫిలింనగర్ సర్కిల్‌ ఇన్‌సైడ్‌ టాక్‌. దింతో ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా, పెద్ది మూవీ మ్యూజిక్ రైట్స్​ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ భారీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పెద్ది ఆడియో రైట్స్​ను టీ సిరీస్ రూ.25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు​ వార్తలు వినిపిస్తున్నాయి. దింతో రామ్​చరణ్ (Ram Charan) కెరీర్​లో అత్యంత భారీ స్థాయిలో మ్యూజిక్ రైట్స్​ అమ్ముడైన చిత్రంగా ‘పెద్ది’ రికార్డ్ సాధిస్తుంది. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. క‌న్న‌డ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఎఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.