ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య హైదరాబాద్ లో మ్యాచ్ మరి కొద్దీ సేపట్లో ప్రారంభవుతోంది. ఈ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ బలా బలాల గురించి తెలుసుకుందాం.
రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్, కోచ్ : రాహుల్ ద్రావిడ్
రాజస్థాన్ రాయల్స్ టీం ఓనర్ రాయల్ మల్టీ స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ నాయకత్వంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీల్ మొదటి సీజన్ లోనే ఛాంపియన్ గా అవతరించింది. ఆ తరవాత రాజస్థాన్ రాయల్స్ 2022 లో సంజు శాంసన్ నాయకత్వంలో రన్నర్ అప్ గా నిలిచింది.
రాజస్థాన్ రాయల్స్ లో ఏడుగురు బాట్స్మన్ ఉన్నారు. కెప్టెన్ సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, హేట్మేర్, శుభమ్ దూబే, కునాల్ రాథోర్ లు ఉన్నారు. ఈ మధ్యనే 13 ఏళ్ళ వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరాడు. అతి చిన్న వయసులో లిస్ట్ -ఎ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి
యువ బాటర్ల తో నిండి ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కువగా జైస్వాల్, సంజు శాంసన్ ల మీదే ఆధారపడుతోంది
నితీష్ రానా, యుద్ వీర్ ల రూపంలో ఇద్దరే అల్ రౌండర్ లు ఉన్నారు. నిఖార్సైన అల్ రౌండర్ లు లేకపోవడంరాజస్థాన్ రాయల్స్ కు ఉన్న అతి పెద్ద బలహీనత.
బౌలింగ్ డిపార్ట్మెంట్ లో యాజమాన్యం 10 మంది బౌలర్ల పై ఖర్చు పెట్టినా, బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత స్ట్రాంగ్ గా లేదు. బౌలింగ్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
పేస్ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, ఆకాష్ మద్వల్, మఫాకా, ఫరూఖీ లతో పాటు యంగ్ మీడియం పేసర్ అశోక్ శర్మ లు ఉన్నారు.
వీరిలో సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ లు అనుభవజ్ఞులైన బౌలర్లు. తుషార్ దేశ్ పాండే, ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. అడపా, దడపా వికెట్ లు తీసి నా ధారాళంగా పరుగులు అనే పేరు ఉంది. ఇక ఫరూఖీ ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన పేస్ బౌలర్. నమ్మదగిన బౌలర్ అని చెప్పవచు
స్పిన్ విభాగం లో స్పిన్నర్ లు తీక్షణ, హాసరంగలతో పాటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుమార్ కార్తికేయ సింగ్ కూడా ఉన్నారు

