అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్ మొదటి రౌండ్ లో పరాజయం పాలైన పీవీ సింధు స్విస్ ఓపెన్ లో మొదటి రౌం లో జాకోబ్ సేన్ చేతిలో 21-17, 21-19 తో ఓటమి పాలైంది.
ప్రపంచ ర్యాంకింగ్ లో 17 వ స్థానంలో ఉన్న పీవీ సింధు, 31 వ స్థానములో ఉన్న జాకోబ్ సేన్ చేతిలో 61 నిమిషాలలోనే రెండు వరస సెట్ల లో ఓటమి పాలైంది
రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన పీవీ సింధు పరాజయాల పరంపర కొనసాగిస్తూ ఉంది. ఈ సంవత్సరంలో మొదటి రౌండ్ లో ఓడిపోవడం పీవీ సింధు కి ఇది మూడవసారి. ఇండోనేషియా మాస్టర్స్, అల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ షిప్, స్విస్ ఓపెన్ లలో మొదటి రౌండ్ లోనే ఓడిపోయి ఇంటిముఖం పట్టింది పీవీ సింధు.

