అల్లు అర్జున్, రష్మిక నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం పుష్ప 2. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలూ సమకూర్చారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిచిన ఈ సినిమా లో ఇండియా లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇప్పుడు పుష్ప 2 చిత్రం ఈ ఏప్రిల్ 13 న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా దక్షిణాది భాషలలో ఒకే రోజు ప్రసారం చేయబోతున్నారు. అయితే చిన్న ట్విస్టులు. ఏప్రిల్ 13 న స్టార్ మా, ఆసియానెట్, కలర్స్ కన్నడ చానెల్స్ లో ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 14 న తమిళుల నూతన సంవత్సరం సందర్భంగా స్టార్ విజయ్ లో ప్రసారం చేయనున్నారు
అన్ని భాషలలో స్టార్ చానెల్స్ లోనే ప్రసారం చేస్తున్నారు. ఒక్క కన్నడ లో మాత్రం వయాకామ్ వారి కలర్స్ కన్నడ లో ప్రసారం చేస్తున్నారు. ఎందుకంటె స్టార్ సువర్ణ ఛానల్ కు అంత రీచ్ లేదు.
థియేటర్లలో బాక్స్ ఆఫీస్ రికార్డు లు బద్దలు కొట్టిన పుష్ప 2 టెలివిజన్ లో ఎలాంటి రికార్డు లు సృష్టిస్తుందో చూడాలి.

