హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ముఫాసా: ద లయన్ కింగ్’ను బారీ జెంకిన్స్ దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన విజువల్స్‌తో యాక్షన్ అడ్వెంచర్‌గా సాగిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ది లయన్ కింగ్’ మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే కేవలం మనదేశంలోనే బాక్సఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని మనదేశంలో ప్రాంతీయ బాషల్లోనూ విడుదల చేయగా.. తెలుగులో ముఫాసా అనే రాజు పాత్రకు సూపర్ స్టార్ మహేశ్ బాబు డబ్బింగ్ చెప్పారు.
అలాగే బాలీవుడ్ హిందీ వెర్షన్‌కి కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పాడు. అలాగే ముఫాసా కొడుకు పాత్ర అయిన సింబా పాత్రకు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఈ సినిమాలో కెల్విన్ హ్యారిసన్ జూనియర్, ఆరోన్ స్టోన్ సహా తదితరులు నటించారు. ఇదిలాఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా మార్చి 26 నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
https://twitter.com/JioHotstar/status/1899717832163696671


