ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) . స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగి అంచనాలను మించి ఘనవిజయం సాధించింది. ఇటీవల కాలంలో ఏ తెలుగు సినిమా సాధించని విధంగా కేవలం మొదటి పది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ చేరుకోవడం చేరుకోవడం విశేషం. చిరు గ్రేస్ కు వెంకీ క్యామియో రోల్ తోడవడం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే జనవరి 12న విడుదలైన ఈ సినిమా రెండో వారంలో కూడా అన్‌స్టాపబుల్‌గా బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది.
ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) రికార్డు క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా $5 మిలియన్ల మైలురాయిని అధిగమించింది. దీంతో చిరంజీవి కెరీర్లోనే ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఇది నిలిచింది. అలాగే పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ బుక్ మై షో (Book My Show) , డిస్ట్రిక్ట్ యాప్స్ లో మన శంకర వరప్రసాద్ గారు ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఏకంగా 5.2 మిలియన్ కు పైగా టికెట్స్ అమ్ముడవ్వడం విశేషం. ఇది రీజనల్ గా ఆల్ టైమ్ రికార్డు కూడా అని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసేలోగా మరిన్ని రికార్డులు సాధించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

