అదిరిపోయే కామెడీతో, నాన్ స్టాప్ పంచులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘మ్యాడ్’.(Mad) బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోష్ లో గతేడాది విడుదలైన ”మ్యాడ్ స్క్వేర్” (Mad Square) సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్ (Sangeetha Sobhan), రామ్ నితిన్ తమదైన కామెడీతో ఆకట్టుకున్నారు. అయితే, మ్యాడ్ ఫ్రాంచైజీలో భాగంగా ఈ ఏడాది “మ్యాడ్ క్యూబ్” (Mad Qube) సినిమా రానున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాతో కొత్త నటులు అడుగుపెడుతున్నారు. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌లలో కేవలం ఒక్కరు మాత్రమే ఈ సినిమాలో ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మ్యాడ్ క్యూబ్ సినిమాలో లిటిల్ హార్ట్స్ (Little Hearts) ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ (Court) ఫేమ్ హర్ష్ రోషన్ నటించనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుండగా.. దీనికి కల్యాణ్ శంకర్ (Kalyan Shankar)దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మ్యాడ్ క్యూబ్ (Mad Qube) చిత్రాన్ని హారర్ కామెడీగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. కాలేజీ అబ్బాయిలు ఉండే హాస్టల్‌లోకి ఓ ఆడ దయ్యం వస్తే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఒకపక్క ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరోపక్క ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ మొత్తానికి దక్కించుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కాగా, డిఫరెంట్ జోనర్ తో రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

