టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వచ్చిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘మ్యాడ్ స్క్వేర్’. సూపర్ హిట్ సినిమా మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కల్యాణ్‌శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. భారీ అంచనాల మధ్య మార్చి 28న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే బాక్సాఫీస్ వద్ద మొదటిరోజే భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటిరోజే బాక్సాఫీస్ వద్ద రూ. 20.8 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డ్ సాధించింది. ఇక రెండు రోజుల్లో ఈ సినిమాకు రూ. 37.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. అంటే రెండో రోజు దాదాపుగా ఈ సినిమా రూ. 17 కోట్ల వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మొదటి రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా రెండో రోజు షేర్స్ ప్రాంతాల వారీగా పరిశీలిస్తే..
★ నైజాం : 2.18 కోట్లు,
★ సీడడ్ : 0.60 కోట్లు
★ ఉత్తర ఆంధ్ర – 0.50 కోట్లు
★ ఈస్ట్ గోదావరి : 0.28 కోట్లు
★ వెస్ట్ గోదావరి : 0.13 కోట్లు
★ గుంటూరు : 0.25 కోట్లు
★ కృష్ణ : 0.22 కోట్లు
★ నెల్లూరు : 0.12 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రూ.4.28 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాకు మొదటి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.55 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 37.2 కోట్లు వసూళ్లు రాబట్టడం విశేషం. అయితే ఈ వారం బాక్సఫీస్ వద్ద ఎంపురాన్, వీర ధీర శూర, రాబిన్ హుడ్ (Robinhood) వంటి పెద్ద చిత్రాలు విడుదలయ్యాయి. బాక్సఫీస్ వద్ద గట్టి పోటీని తట్టుకుంటూ కూడా మ్యాడ్ స్క్వేర్ (Mad Square) అన్ని సినిమాల కంటే సాలిడ్ కలెక్షన్స్ సాధించింది. ఇక ఇక్కడే కాకుండా ఈ సినిమాకు ఓవర్సీస్లోనూ భారీ స్థాయిలో థియేటర్లు నిండుతున్నాయి. ఈ క్రమంలోనే మ్యాడ్ స్క్వేర్ మొదటి రెండు రోజుల్లోనే ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. రెండు రోజుల్లోనే 750 డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.

