మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ల విధ్వంసం ; LSG భారీ స్కోర్

by | Apr 8, 2025 | వార్తలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్ల లో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది

లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్క్రమ్ లు మొదటి వికెట్ కు 99 పరుగులు జోడించారు

మార్క్రమ్ 28 బంతుల్లో 47 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  అయితే ఆ తరవాత వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోల్ కతా నైట్ రైడర్స్ బౌలింగ్ ని ఊచకోత కోశాడు. మరోవైపు మార్ష్ కూడా ఎక్కడ తగ్గలేదు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 71 పరుగులు జోడించారు

48 బంతుల్లో 5సిక్సర్లు, 6 ఫోర్ల  సాయంతో, 81 పరుగులు చేసిన మార్ష్ అవుట్ అయ్యాడు. 

ఆ తరవాత వచ్చిన  అబ్దుల్ సమద్ తో జత కలిసిన పూరన్ మూడవ వికెట్ కు 51 పరుగులు జోడించారు.  ఇందులో అబ్దుల్ సమద్ చేసిన పరుగులు 6. 

నికోలస్ పూరన్ చివర వరకు నిలబడి 36 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్లలో హర్షిత్ రానా రెండు వికెట్లు, రస్సెల్ ఒక వికెట్ తీశారు