కన్నప్పలో ‘లవ్​ సాంగ్’ ఎందుకు.. మంచు విష్ణు ఆన్సర్ ఇదే!

by | Mar 15, 2025 | సినిమా

విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ (Kannappa) మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేశ్‌ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మేకర్స్​ ప్రమోషన్స్ ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ‘లవ్‌ సాంగ్‌’పై కొన్ని విమర్శలు వచ్చాయి. భక్తి సినిమాలో ఇలాంటి పాటలు పెట్టడం ఏంటని కొందరు కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో హీరో మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘కన్నప్ప’ (Kannappa) లో భక్తి కీర్తనలతో పాటుగా మంచి ప్రేమ పాటలు ఉన్నాయి. 2వ శతాబ్దంలో ఎలాంటి దుస్తులు ధరించారు అనేది ఈ పాటల్లో కనిపిస్తుంది. ఈ సినిమాలో శివుడి పాటను కూడా కొందరు విమర్శించారు. ఈ లవ్ సాంగ్ సినిమాలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. నేను సినిమా డాక్యుమెంటరీ తీయట్లేదు. కమర్షియల్‌ సినిమా తీసున్నాను. కాబట్టి ఇందులో అన్ని అంశాలకు సమ ప్రాధాన్యం ఉంటుంది అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు. కాగా, ఇందులో హీరోయిన్ గా ‘ఓం భీమ్ బుష్’ ఫేమ్ ప్రీతి ముకుందన్ నటిస్తోంది. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీ దేవిగా అలరించబోతున్నారు. అలానే మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, శరత్ కుమార్ , బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. వీరితో పాటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సినిమాలో రుద్ర పాత్రను పోషించారు. పలు ఇండస్ట్రీలకు చెందిన యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తుండటంతో సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఈ మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. కాగా, పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ స్టీఫెన్‌ దేవస్సే, తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.