ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభం

by | Jan 13, 2025 | వార్తలు

కాసుల కప్, ధమాకా క్రికెట్ కప్ కు రంగం సిద్ధమవుతోంది.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చ్ 21 న ప్రారంభమవుతోంది. మే 25 న ఫైనల్ జరుగుతుంది

మొదటి మ్యాచ్ కు, కలకత్తా లోని, ఈడెన్ గార్డెన్స్ లో జరగబోతోంది.  టోర్నీ ఫైనల్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే జరగబోతోంది.  2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలుచుకున్న విషయం మనందరికీ తెలిసిందే. 

అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, ప్లే ఆఫ్ లో తొలి రెండు మ్యాచ్లు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.  ఈ సీజన్ మొత్తం 74 మ్యాచ్ లు ఉంటాయి.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పూర్తి షెడ్యూల్ మరో నెలలో విడుదల చేయవచ్చు. 

అంతకన్నా ముందు వచ్చే నెల 19 న ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ కి భారత జట్టును ప్రకటించాల్సి ఉంది.