సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై అల్లు అర్జున్ ప్రభావం

by | Jan 11, 2025 | సినిమా

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత, దాని ప్రభావం యావత్ తెలుగు సినీ పరిశ్రమపై పడింది.  మరి ముఖ్యంగా తెలుగు సినిమా (Telugu Cinema) నైజాం కలెక్షన్స్ మీద విపరీతమైన ప్రభావం పడింది.  పుష్ప మేకర్స్ కు మాత్రం బానే లాభాలు వచ్చాయి.  కేవలం, అల్లు అర్జున్ (Allu Arjun) సంధ్య థియేటర్ కు వెల్లడ వల్లే,  రేవతి అనే మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్ లో ఇంకా చికిత్స పొందుతూ ఉండడం, సినిమా టికెట్ రేట్ల పెంపు, అదనపు షో ల విషయం పై ప్రభుత్వం మరియు హై కోర్ట్ మధ్య వాదనలు, సంక్రాంతి సినిమాల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం వంటి అంశాలు  ప్రభావితం అయ్యాయి.  రేపో, మాపో వీటి ప్రభావం తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు

సంక్రాంతి సినిమాలకు అదనపు షోల కు అనుమతి ఇవ్వడం కాకుండా, టికెట్ రేట్లను పెంచుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  అయితే బెనిఫిట్ షోస్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.

అయితే, ఈ అదనపు షో లు మరియు టికెట్ ధరల పెంపు ను సవాల్ చేస్తూ, హై కోర్ట్ లో 3 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

వీటి పై విచారణ చేపట్టిన హై కోర్ట్ తీవ్రం గా స్పందించింది.  తెల్లవారు జామున వేసే షో లను కూడా బెనిఫిట్ షో ల కింద పరిగణించాలని చెప్పింది . అర్ధ రాత్రి రెండు గంటల తరవాత మీ పిల్లలను రోడ్ల పై తిరగనిస్తారా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు 

వీటి పై విచారణ చేపట్టిన హై కోర్ట్ తీవ్రం గా స్పందించింది.  తెల్లవారు జామున వేసే షో లను కూడా బెనిఫిట్ షో ల కింద పరిగణించాలని చెప్పింది . అర్ధ రాత్రి రెండు గంటల తరవాత మీ పిల్లలను రోడ్ల పై తిరగనిస్తారా అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు.  ఇలాగె నిబంధనలు ఉల్లంగిస్తే, రాత్రి 11 గంటల తర్వాత సినిమా థియేటర్లను, పబ్ లను మూసివేయాలని ఆదేశాలిస్తాం అని ప్రభుత్వ నయవాదిని,  న్యాయమూర్తి హెచ్చరించారు

పిటిషనర్ తరపు న్యాయవాది, సంధ్య థియేటర్ ఘటన తరవాత, ప్రభుత్వం ఇక పై బెనిఫిట్ షో లు ఉండవని, టికెట్ రేట్లు కూడా పెంచమని అసెంబ్లీ సాక్షి గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అని చెప్పారు. అయిన మల్లి అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారు

ప్రభుత్వ న్యాయవాది, గేమ్ చేంజర్ టికెట్ రేట్లు సింగల్ స్క్రీన్ లలో, మల్టీప్లెక్స్ లలో ఎంత పెంచాము మరియు ఎన్ని రోజుల కు అదనపు షోల కు పర్మిషన్ ఇచ్చాము  అనే విషయాలను ప్రభుత్వ న్యాయవాది, న్యాయమూర్తి కి  వివరించారు.

అయితే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయ మూర్తి, టికెట్ రేట్లు పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వులను, ప్రభుత్వం పునః సమీక్షించాలని ఆదేశించారు.  దీని పై తదుపరి విచారణను ఈ నెల 28 కి వాయిదా వేశారువిచారణను ఈ నెల 28 కి వాయిదా వేశారు