కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మరో అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేషన్ వచ్చినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఈ క్రమంలోనే స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీ రన్ టైమ్ విషయానికొస్తే.. 2 గంటల 20 నిమిషాల సాలిడ్ రన్ టైం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అయితే ఇబ్బందికరంగా ఉన్న దాదాపు 2 నిమిషాల సీన్స్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా 1 నిమిషం 41 సెకన్ల పాటు ఉన్న సీన్స్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అజిత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 10 నుంచి థియేటర్లలో సందడి చేయడం ఖాయమైంది. అలాగే ఈ సినిమా శాటిలైట్ హక్కులతో పాటుగా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) ఈ సినిమా డిజిటల్ రైట్స్ రూ. 95 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్, ప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. యోగిబాబు, రాహుల్ దేవ్, అర్జున్ దాస్, ప్రభు ఇతక ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

