ఫోర్బ్స్ 2025 సంపన్నుల జాబితా : నెంబర్ 1 ఎలాన్ మస్క్, 18 వ స్థానంలో ముకేశ్ అంబానీ
ఫోర్బ్స్ 1987 నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సంపన్నుల జాబితాను పరిశీలిస్తోంది. మొదటి సంవత్సరంలో 140 మంది బిలియనీర్లు ఉండగా 2025 లో ఈ సంఖ్య మూడు వేలు దాటింది
ఫోర్బ్స్ ప్రపంచ ధనిక బిలియనీర్ల జాబితా 2025 ప్రకారం వీరి వద్ద 16.1 ట్రిలియన్ డాలర్ల సంపద ఉందని తెలిపింది
అమెరికా లో అత్యధికంగా 902 మంది బిలియనీర్లు ఉండగా, చైనా లో 516 మంది, ఇండియా లో 205 మంది బిలియనీర్లు ఉన్నారు
ఫోర్బ్స్ 2025 సంపన్నుల జాబితాని విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఎలాన్ మస్క్ అగ్ర స్థానంలో ఉన్నారు. పేస్ బుక్ ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ రెండవ స్థానంలో, అమెజాన్ జెఫ్ బెజోస్ మూడవ స్థానంలో ఉన్నారు
వారెన్ బఫెట్ ఆరవ స్థానంలో ఉండగా, మన దేశానికి చెందిన ముకేశ్ అంబానీ ప్రపంచ కుబేరుల జాబితాలో 18 వ స్థానములో ఉన్నారు. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల జాబితా 2025 పూర్తి వివరాల కోసం ఈ లింక్ ఓపెన్ చేయండి

