మెగా స్టార్ చిరంజీవి, రంభ జంటగా నటించిన బావగారు బాగున్నారా చిత్రం విడుదలై నేటికీ 27 సంవత్సరాలు అయింది
1998 ఏప్రిల్ 9 విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అంజనా ప్రొడక్షన్స్ పై నాగబాబు నిర్మించిన ఈ బావగారు బాగున్నారా చిత్రానికి దర్శకుడు జయంత్ సి పరాంజీ.
ఇంకా ఈ చిత్రంలో రచన, పరేష్ రవెల్, సత్యనారాయణ, శ్రీ హరి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం తదితరులు నటించారు.
మణి శర్మ ఈ చిత్రానికి స్వరాలూ సమకూర్చారు. ఈ చిత్రంలో ఆంటీ కూతురా…’ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ పాట ఇప్పటికి మంచి డాన్స్ నెంబర్.
బావగారు బాగున్నారా చిత్రంలో కొన్ని సన్నివేశాలు న్యూజిలాండ్ లో చిత్రీకరించారు. అంతే కాకుండా మెగా స్టార్ చిరంజీవి అభిమానుల కోసం చేసిన బంగి జంప్ ని ఈ సినిమా మొదట్లో చూపిస్తారు
ఈ సినిమా కధ ఏంటంటే, అనుకోని పరిస్థితులలో రాజు (చిరంజీవి), సంధ్య అనే అమ్మాయికి భర్తగా నటించాల్సి వస్తుంది. అయితే ఈ సంధ్య రాజు న్యూజిలాండ్ లో ప్రేమించిన స్వప్న అక్క.
రాజు (చిరంజీవి), సంధ్య(రచన) వాళ్ళ ఊరు వెళ్ళతారు. ఆ ఇంట్లో సంధ్య తల్లి, తండ్రి, నానమ్మ, తాతయ్యలు ఉంటారు. సంధ్య, రాజు ని వాళ్లందరికీ పరిచయం చేస్తుంది. అయితే, రాజు ని ఇంటి అల్లుడుగా ఒప్పుకోడు సంధ్య తండ్రి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్.
ఈ లోగా పరీక్షలు పూర్తి చేసుకుని స్వప్న ఇంటికి వస్తుంది. అంతే, స్వప్నకు షాక్ తాను ప్రేమించిన రాజు, తన అక్క భర్తగా, తనింటికే రావడం. ఆ తరవాత స్వప్న నిజం తెలుసుకోవడం, రాజు, సంధ్య ప్రేమించిన వాడిని తీసుకు వచ్చి పెళ్లి చేయడంతో కధ సుఖంతమవుతుంది. ఈ సినిమా ఆద్యంతం సరదాగా సాగిపోతుంది. మెగా స్టార్ చిరంజీవి టైమింగ్ అద్భుతం
ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ హైలైట్ అని చెప్పవచ్చు. చిరంజీవి కామెడీ టైమింగ్ అదిరిపోతోంది. చిరంజీవి, శ్రీ హరి, కోట శ్రీనివాసరావు కంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి
ఈ సినిమాతో మరో సారి చిరంజీవి హ్యాట్రిక్ హిట్స్ కొట్టారు. ఈ సినిమాకు ముందు వచ్చిన రెండు సినిమాలు హిట్లర్, మాస్టర్ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.

