‘ఛావా’ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్​ ఎప్పుడంటే.?

by | Feb 16, 2025 | సినిమా

బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కథానాయకుడుగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ‘ఛావా’. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ జీవిత కథతో రూపొందిన ఈ సినిమాలో శంభాజీ మహరాజ్‌గా విక్కీ, ఆయన సతీమణి యేసుబాయి పాత్రలో రష్మిక నటించారు. శివాజీ సావంత్ రాసిన ‘ఛావా’ ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కగా.. గతేడాది ‘స్త్రీ-2’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దినేశ్ విజాన్ రూ.130 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలై తొలి రోజే హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది.

వాలెంటైన్స్​ డే కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ తొలి రోజు ఏకంగా రూ.31 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్ దక్కించున్న సినిమాగా చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. అయితే ఛావా మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుండడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఫాన్స్, మూవీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ విడుదలకు ముందే డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు కొనుగోలు చేసిందంట. ఒకవేళ ఈ సినిమాకు హిట్ టాక్‌ రాకుంటే కేవలం మూడు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారట. కానీ ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ రావడంతో రెండు నెలల తర్వాత అంటే ఏప్రిల్ రెండో వారంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది.