ఛాంపియన్స్ ట్రోఫీ : సెమిస్ లో భారత ప్రత్యర్థి ఎవరు?

by | Mar 1, 2025 | వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) గ్రూప్ ఏ లో ఎవరు సెమిస్ కు వెళతారు అనేది సునాయాసం గా తేలిపోయింది.  గ్రూప్ బి లో ఎవరు సెమిస్ కు వెళతారు అనేది పూర్తిగా నిర్ధారణకు రాలేక పోతున్నాం.  అయితే ఒక సారి ఇప్పుడు మనముందున్న అవకాశాలను చూద్దాం.

ఈ రోజు ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ నమ్మశక్యం గా  లేని విధంగా గెలిస్తేనే ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా జట్లను ప్రభావితం చేస్తుంది.  ఇంగ్లాండ్ ఎలాగూ ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించింది.

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘానిస్తాన్ జట్లకు మూడేసి పాయింట్ లు ఉన్నాయి.

ఒక వేళ ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిస్తే, నెట్ రన్ రేట్ ఆధారంగా సౌత్ ఆఫ్రికా సెమిస్ కు చేరుతుంది.  ఎందుకంటె, ప్రస్తుతానికి  ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్ రేట్ – 0.99 ఉంటె సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ (Net Run Rate) +2.14 ఉంది.  ఇరు జట్ల నెట్ రన్ రేట్ లో భారీ వ్యత్యాసం ఉంది

ఒక వేళ, సౌత్ ఆఫ్రికా గెలిస్తే నేరుగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో సెమిస్ కు వెళుతుంది.

వర్షం పడి మ్యాచ్ రద్దు అయినా సౌత్ ఆఫ్రికా పాయింట్ ల పట్టికలో నెంబర్ వన్ స్థానానికి వస్తుంది

అయితే ప్రస్తుత జట్టు ఫామ్ ని చూస్తే సౌత్ ఆఫ్రికా కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటె ఇంగ్లాండ్ బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం ఘోరంగా ఉంది. 

భారత (India) , న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మ్యాచ్ మాత్రం హోరా హోరి పోరు తప్పదన్నట్లుగా ఉంది. అయితే సెమి ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా తో తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి

పోరాటానికి మారు పేరు గా ఉండే భారత, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమి ఫైనల్ కు అర్హత కలిగిన జట్లే.  2 సెమి ఫైనల్స్, ఫైనల్ మహా సంగ్రామాన్ని తలపిస్తాయి అనడంలో సందేహం అక్కర్లేదు.

పాయింట్స్ టేబుల్ ప్రస్తుతానికి

TeamMatchesWonLostNRPointsNRR
South Africa21013+2.14
Australia31024+0.47
Afghanisthan31113-0.99
England20200-0.30