టాలీవుడ్ లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో ఒకరు అక్కినేని అఖిల్. గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద వద్ద నిరాశ పరిచింది. ఇప్పటివరకు నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్ తదుపరి సినిమా ఏంటి అని ఎదురుచూస్తున్న వారి కోసం ఇటీవలే కొత్త అప్డేట్ తెరపైకి వచ్చింది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ కిరణ్ మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. ఈ మూవీకి ‘లెనిన్’ (Lenin Akhil) అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సైలెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని వార్తలు వినిపిస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా బరిలో నిలపాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే అఖిల్ (Akkineni Akhil) తాజాగా మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ‘సామజవరగమన’ మూవీకి రైటర్ గా పనిచేసిన నందు చెప్పిన స్క్రిప్ట్ అఖిల్ కు నచ్చడంతో వెంటనే ఈ ప్రాజెక్టును అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. ఈ ఏడాది సెకండాఫ్ లో షూటింగ్ మొదలు పెట్టి చిత్రీకరణ పూర్తి చేయనున్నారు. ఈ సినిమాకు శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

