సోషల్ మీడియా లో ‘ఐ బొమ్మ రవి’ కి మద్దతు !!??

by | Nov 17, 2025 | ప్రగడ టీవీ

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ని హైదరాబాద్ లో పోలీస్ లు అరెస్ట్ చేశారు.  ఇమ్మడి రవి పాస్ పోర్ట్ ను సీజ్ చేయడమే కాకుండా, ఇమ్మడి రవి చేతే ఐ బొమ్మ వెబ్ సైట్ ను క్లోజ్ చేయించారు.  అతని ఆస్తులను కూడా అటాచ్ చేయబోతున్నారు

ఒక వైపు ఇమ్మడి రవి విశాఖపట్నం, హైదరాబాద్ లో ఉన్న తన ఆస్తులను అమ్ముకుని పెర్మనెంట్ గా తన మకాం కరీబియన్ దీవులకు మార్చే ప్రయత్నం లో హైదరాబాద్ వస్తే అరెస్ట్ చేశారనేది ఒక వార్త.  మరో వైపు ఇమ్మడి రవి ని అతని భార్య పట్టించిందని ఒక వార్త. ఏదేమైనా మన పోలీసులు ఇమ్మడి రవి ఆట కట్టించారు

అయితే ఈ విషయంలో సోషల్ మీడియాలో  కొంత మంది ఐ బొమ్మ రవి కి మద్దతు ఇస్తున్నారు.  ఇది చాలా దుర్మార్గమైన చర్య.  ఇమ్మడి రవి సొంతంగా సినిమాలు నిర్మించాడా? ఎవరో తీసిన సినిమాలు దొంగతనంగా తీసి వాటిని వెబ్ సైట్ లో పెట్టి, ఆ సినిమాలను చూడడానికి వచ్చిన వాళ్ళని గేమింగ్ వైపు మళ్లించే క్రమంలో కోట్లు సంపాదించాడని తెలుస్తోంది. 

అటువంటి వ్యకికి సోషల్ మీడియా లో మద్దతా?  డబ్బు ఖర్చు లేకుండా కొత్త సినిమాలు బేవార్స్ గా చూసే బ్యాచ్ ఇదంతా.  ఏమైనా అంటే టికెట్ రేట్లు తగ్గించండి,  థియేటర్ లో పాప్ కార్న్ రేట్ తగ్గించండి అని కొంత మంది గొంతు చించుకుంటున్నారు.  బేవార్స్ గా రూపాయి ఖర్చు లేకుండా సినిమా చూసే వాళ్లంతా లబో దిబో మంటున్నారు.  ఏ రేట్లు పెరగ కూడదు, ఎవరు ఎక్కువగా సంపాదించ కూడదు, మనం తట్టుకోలేము.  మనకు నచ్చని వాడు ఎదిగితే చూసీ ఓర్చుకోలేము. మన జీతాలు, మన ఆదాయం పెంచుకోవాలని మాత్రం ఆలోచించం. సోషల్ మీడియా వేదికలు వ్యక్తిగత కక్షల కోసం, నెగటివిటీ కోసం వాడుకుంటున్నారు.

ఇంకా కొంత మంది మూవీ రూల్స్ అనే మరో వెబ్ సైట్ ఉంది అని దాని గురించి మాట్లాడుతున్నారు.  సదరు ఇమ్మడి రవి దగ్గర 50 లక్షల సబ్ స్క్రైబర్స్ డేటా ఉందట.  ఈ డేటా తో వాడు వీళ్ళని ఎందులోనైనా ఇరికిస్తే మళ్ళీ వీళ్లకు (సదరు ఇమ్మడి రవికి మద్దతు ఇస్తున్న వాళ్ళు) పోలీస్ లే గతి

అడ్డగోలుగా, అన్యాయంగా డబ్బు సంపాదించడం చట్ట రీత్యా నేరం.   అటువంటి వాళ్లకు మద్దతు ఇచ్చిన వాళ్ళు కూడా తప్పు చేసినట్లే.

సినిమా విడుదలైన 4 వారాలకే ఓ టీ టీ లో సినిమాలు వస్తుంటే ఇంకా ఫ్రీ గా సినిమాలు చూసే బ్యాచ్ ఉందా.  మన దేశంలో ఉచితం అంటే అందరు ఎగబడతారు.  అందుకే రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలవడానికి  జనాల బలహీనత అయిన ‘ఉచితాల’ మీద దృష్టి పెడతారు. 

ఏది ఏమైనా కర్మ ఎవరిని వదిలి పెట్టదు. అందరికి వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది.  ఈ రోజు ఐ బొమ్మ రవి కి  రిటర్న్ గిఫ్ట్ వచ్చింది. సదరు సోషల్ మీడియా లో నెగటివిటీ ని ప్రోత్సహించే వాళ్లకు, అనవసరంగా వ్యక్తుల మీద, వ్యవస్థల మీద విషం కక్కే వాళ్లకు ఇదే పరిస్థితి వస్తుంది  రిటర్న్ గిఫ్ట్ గారంటీ.  ఒక రోజు ఆటో ఇటో….