మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న ‘వారణాసి’ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అయితే కె ఎల్ నారాయణతో పట్టు ఈ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు ఎస్ ఎస్ కార్తికేయ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారని నిన్న రామోజీ ఫిలిం సిటీ లో జరిగిన టైటిల్ గ్లిమ్ప్స్ లాంచ్ ఈవెంట్ చూసిన వారందరికీ తెలుస్తుంది. భారీస్థాయి ప్రాజెక్ట్ కాబట్టి పరోక్షంగా రాజమౌళి కూడా ఈ సినిమా మీద పెట్టుబడి పేతున్నారని తెలుస్తోంది. గ్లోబల్ రీచ్ ఉన్న సినిమా కాబట్టి ఈ సినిమాకు ఎస్ ఎస్ కార్తికేయను నిర్మాతగా ప్రమోట్ చేసి ఉండవచ్చు మన రాజమౌళి. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంత, మహేష్ బాబు కూడా లాభాల్లో వాటా ఉందా అనే విషయం ఇంకా తెలియాలి
ఈ వారణాసి చిత్రం కొన్ని ప్రత్యేకతలతో రూపు దిద్దుకుంటోంది.
- పూర్తిగా ఐ మాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా తీయడం
- ఈ వారణాసి సినిమాకు రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ నిర్మాతగా వ్యవహరించడం
- ఇప్పటి వరకు రాజమౌళి ఎక్కువగా కెమెరామాన్ సెంథిల్ కుమార్ కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు చేశారు.
- సై, ఛత్రపతి, యమదొంగ, మగధీర, ఈగ, బాహుబలి ఫ్రాంచైజ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు కెమరామెన్ సెంథిల్ కుమార్ పని చేశారు. అయితే ఇప్పుడు వారణాసి సినిమాకు పి ఎస్ వినోద్ కెమరామెన్ గా వ్యవహరిస్తున్నారు
- ఇప్పటివరకు రాజమౌళి సినిమాలకు ఎక్కువ చిత్రాలకు సంభాషణలు రాసింది ఏం రత్నం. రాజమౌళి దర్శకత్వం వహించిన 7 సినిమాలకు ఏం రత్నం సంభాషణలు రాశారు. అయితే బాహుబలి కి డైలాగ్స్ రాసింది విజయ్ కుమార్, అజయ్ కుమార్ ద్వయం అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సాయి మాధవ్ బుర్ర సంభాషణలు రాశారు. ఈ సినిమాకు మొదటి సారిగా దేవా కట్టా సంభాషణలు రాస్తున్నారు.
- రాజమౌళి సినిమాకు కధ లను అందించేది మాత్రం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గారు మాత్రమే. ఈగ సినిమా తరవాత మళ్ళీ ఈ వారణాసి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి, రచయిత ఎస్ ఎస్ కంచి స్టోరీ డిపార్ట్మెంట్లో పని చేశారు
ఈ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయాలనీ ఆశిస్తున్నాము

