జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిదో తెలుసా ; ఎగ్జిట్ పోల్స్ షాక్

by | Nov 11, 2025 | రాజకీయాలు

ఈ రోజు జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీ లు సర్వ శక్తులు వడ్డీ పోరాడాయి.  అధికార పార్టీ అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం గా ప్రచారం చేస్తే, బి ఆర్ ఎస్ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు మీద దృష్టి పెట్టింది.

చాణక్య స్ట్రాటజీ ప్రకారం కాంగ్రెస్ (Congress) కు 46 శాతం, భారాస (BRS) కు 43 శాతం బీజేపీ (BJP) కి 6 శాతం  ఓట్లు వస్తాయని అంచనా వేసింది

స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 48.2 శాతం, భారాస కు 42.1 శాతం బీజేపీ కి 7.6 శాతం  ఓట్లు వస్తాయని అంచనా వేసింది

హెచ్ ఏం ఆర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కు 48.3 శాతం, భారాస కు 43.18 శాతం బీజేపీ కి 5.84 శాతం  ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

మాగంటి గోపినాధ్ (Maganti Gopinadh) ఈ స్థానం నుండి వరసగా మూడుసార్లు గెలుపొందారు.  అయితే మాగంటి గోపినాధ్ మృతితో ఈ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.పేరుకు ముక్కోణపు పోటీ అయినా, ప్రధాన పోటీ మాత్రం అధికార కాంగ్రెస్, భారాస ల మధ్యే ఉంది.  భాజపు మరోసారి నిరాశ తప్పదు

ఎగ్జిట్ పోల్స్ అని అధిక శాతం అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాయి.  ఆలా అని అధికార కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షం కాదు.  మాగంటి గోపినాధ్ భార్య మాగంటి సునీత కు కొంత సింపతీ కూడా కలిసొచ్చే అవకాశం ఉంది.  భారాస కూడా మంచి పోటీ ఇస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెపుతున్నాయి

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అధికార కాంగ్రెస్, భారాస ల మధ్య ఓట్ల తేడా 1-5% శాతం మాత్రమే ఉంది.  కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ కి గెలుపు అంత ఈజీ కాదు.  అయితే అధికార పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Navin Yadav) గట్టి పోటీ ఇచ్చారని తెలుస్తోంది. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్వయంగా ప్రచారంలో పాల్గొనడం, హుటా హుటిన అజహారుద్దీన్ ను తీసుకు వచ్చి మైనారిటీ శాఖ మంత్రిని చేయడం, అంతే కాకుండా జూబ్లీ హిల్స్ లో ఫిలిం వర్కర్స్, యూనియన్ లు కూడా ఉంటాయి.  వాళ్లకు లబ్ది చేకూరేలా, పెంచిన సినిమా టిక్కెట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో 20% సినీ కార్మికులకు ఇచ్చేలా జి ఓ తీసుకు రావడం వంటి వంశాలు అధికార కాంగ్రెస్ పార్టీ కి కలిసొచ్చే అంశాలు. 

అయితే జూబ్లీ హిల్స్ స్థానాన్ని ఎవరు చేజిక్కించుకుంటారో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాలి