అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా  ‘కూలీ’ నిలుస్తుందా?

by | Aug 12, 2025 | సినిమా

రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తోన్న ముల్టీస్టారర్ ‘కూలీ’ ఈ ఆగష్టు 14 న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో పాటు, అక్కినేని నాగార్జున (Nagarjuna) , ఉపేంద్ర, శృతి హాసన్ తదితరులు నటించారు

కూలీ తో పాటు ఎన్టీఆర్ (NTR) వార్ 2 కూడా అదే రోజు విడుదలవుతోంది.  అయితే వార్ 2 (WAR) కన్నా, కూలీ చిత్రం మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి.

కోలీవుడ్ లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా 660 కోట్లతో రజనీకాంత్ (Rajanikanth) నటించిన 2.O మొదటి స్థానంలో ఉంది.  లోకేష్ కనకరాజ్, విజయ్ ల కాంబినేషన్ లో వచ్చిన లియో 630 కోట్ల తో రెండవ స్థానంలో ఉండగా, సుమారు 600 కోట్లతో రజనీకాంత్ (Rajanikanth) నటించిన జైలర్ (Jailer) చిత్రం మూడవ స్థానంలో ఉంది.

తరవాతి మూడు స్థానాలలో పొన్నియన్ సెల్వన్-1 చిత్రం 500 కోట్లతో, విజయ్ నటించిన ది గోట్ 460 కోట్లతో, కమల్ హాసన్, లోకేష్ కనకరాజ్ నటించిన విక్రమ్ 434 కోట్లతో 6 వ స్థానంలో ఉంది.

టాప్ 6 మూవీస్ లో రెండు రజనీకాంత్, రెండు లోకేష్ కనకరాజ్ (Lokesh Kanaka Raj) దర్శకత్వం వహించిన  సినిమాలు ఉన్నాయి.

ఈ ట్రాక్ రికార్డు బట్టి చూస్తే కూలీ చిత్రం, ఇప్పటి దాకా అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన 2.O చిత్రం రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది

ఈ సినిమాకి రజనీకాంత్ (Rajanikanth) 150 కోట్ల పారితోషికం తీసుకున్నాడని తెలుస్తోంది.  సుమారు 400 కోట్లతో సన్ పిక్చర్స్ భారీగా నిర్మించిన ఈ కూలి చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి.

కోలీవుడ్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలుస్తుందా, 1000 కోట్ల మైలురాయిని అందుకుంటుందా, రజని మానియా పని చేస్తుందా అనేది తెలియాలంటే 48 గంటలు ఆగాలి.

ఇండిపెండెన్స్ డే, కృష్ణాష్టమి సెలవులతో లాంగ్ వీకెండ్ కావడంతో,  హిట్ టాక్ వస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద  ‘కూలీ’  (Coolie)భారీ వసూళ్లు సాధించవచ్చు