ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి. అనేక రకాల బ్యాంకు లు వాళ్ళ పరిధిని బట్టి పట్టణాల్లో, పల్లెల్లో సేవలందిస్తున్నాయి.
అయితే తాజాగా ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ (Savings Account) హోల్డర్స్ మీద కొరడా ఝుళిపించింది. సాధారణంగా సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ లలో కనీస నిల్వలు లేకపోతే బ్యాంకులు నామ మాత్రపు చార్జీలు వసూలు చేస్తాయి
అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులలో అగ్రగామి అయిన ఎస్ బి ఐ బ్యాంకు, కనీస నిల్వలు లేకపోతే పెనాల్టీ విధించే నిబంధనను ఎత్తివేసి ఖాతా దారులకు ఊరట కల్పించింది.
ఎస్ బి ఐ (SBI Bank) బ్యాంకు ను అనుసరించి మరి కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంకు అఫ్ బరోడా, ఇండియన్ బ్యాంకు లు కూడా ఈ పెనాల్టీ నిబంధనలను తొలగించాయి
ఐసీసీ బ్యాంకు (ICICI) సేవింగ్స్ అకౌంట్ హోల్డర్స్ తమ ఖాతాలలో కనీసంగా 50 వేల రూపాయల నిల్వను ఉంచాలి అనే నిబంధనను విధించింది. ఈ నిబంధన ఆగష్టు 1, 2025 నుండి అమలులో ఉంటుంది.
ఈ, కనీస నిల్వను 10 వేల రూపాయలనుండి, అమాంతం 50 వేల రూపాయలకు పెంచేశారు. సెమి అర్బన్ ప్రాంతాల కనీస నిల్వను 5 వేల నుండి 25 వేలకు, గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కనీస నీవేల 2500 నుండి 10 వేల వరకు పెంచేశారు. ఈ కనీస నిల్వలు మీ బ్యాంకు అకౌంట్ లో లేని పక్షంలో బ్యాంకు కు పెనాల్టీ చార్జీలను విధిస్తారు
ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయినా హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు లో కనీస నిల్వ మొత్తం పది వేల రూపాయలుగా ఉంది
కనీస నిల్వలు ఉంచని ఖాతాదారులు విధించే చార్జీలు, ఎటిఎం (ATM) , ఏసమ్మెస్ (SMS Charges) సర్వీస్ చార్జీల కింద ప్రభుత్వ మరియు ప్రధాన ప్రైవేట్ బ్యాంకు లు 2018 నుండి ఇప్పటివరకు 35 వేల కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. ఇటివలే ఈ విషయాన్నీ రాజ్య సభ లో కేంద్ర ప్రభుత్వం రాత పూర్వకం గా ప్రకటించింది
ఐసీఐసీఐ బ్యాంకు ఇచ్చిన ఈ షాక్ కు ఖాతా దారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఖాతా దారుల బ్యాంకు అకౌంట్ లో 50 వేల రూపాయల కనీస నిల్వలకు కారణం ఏమిటీ అనేది తెలియాలి. ఐసీఐసీఐ బ్యాంకు కష్టాల్లో ఉందా, ప్రజల వద్ద నుండి ఈ రకంగా డబ్బు వసూలు చేస్తుందా. ఈ 50 వేల రూపాయల మీద ఖాతా దారులకి ఎంత వడ్డీ చెల్లిస్తుంది అనేది ఇంకా తెలియలేదు
సరైన కారణం లేకుండా, ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంకు ఇలాంటి షాక్ లు ఇస్తే, బ్యాంకు సేవింగ్స్ ఖాతాలను కోల్పోయే అవకాశముంది. చివరకు శాలరీ అకౌంట్ హోల్డర్స్ మాత్రమే ఉంటారు. ఐసీఐసీఐ (ICICI Bank) బ్యాంకు చర్యల వలన హెడ్ డి ఎఫ్ సి (HDFC Bank) బ్యాంకు లాభ పడే అవకాశం ఉందా అనే దానికి కాలమే సమాధానం చెప్పాలి

