సామాన్యులను, సెలెబ్రిటీలుగా మార్చిన ETV జబర్దస్త్ కు 12 ఏళ్ళు

by | Aug 3, 2025 | టీవీ & ఓటిటి

ఈటీవీ అనగానే ఈ తరం ప్రేక్షకులకు మొదటగా గుర్తుకు వచ్చేది ‘జబర్దస్త్’ అనే కామెడీ షో.  జబర్దస్త్ ప్రారంభమయి 12 ఏళ్ళు అయిన సందర్భంగా, ఈ షో మొదలనప్పటినుండి ఇప్పటిదాకా ఈ షో లో భాగమైన అందరిని పిలిచి, రెండు ప్రత్యేక ఎపిసోడ్ లను చేశారు ఈటీవీ యాజమాన్యం.

ముందుగా గురువారం జబర్దస్త్ (Jabardasth) ని స్టార్ట్ చేశారు.  ఈ షో హిట్ అయ్యాక, శుక్రవారం కూడా ఎక్స్ట్రా జబర్దస్త్ అని కామెడీ డోస్ పెంచారు.  అది కూడా హిట్ అయ్యింది

పగలంతా పని చేసి అలసిపోయిన వాళ్ళు రాత్రి ఇంటికి వచ్చి సరదాగా కాసేపు నవ్వుకునేలా చేసిన ఈ జబర్దస్త్ షో, ఒకానొక దశలో,  ప్రతి ఇంటిలో భాగం అయ్యింది.  అయితే ఆ తరవాత కామెడీ అంత పండక పోవడంతో ఈ షో సక్సెస్ రేట్ పడి పోతు వచ్చింది

సామాన్యులను సెలబ్రిటీలు గా మార్చిన షో ఈ జబర్దస్త్. మల్లెమాల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి ఆద్యులు.

ఇండస్ట్రీ కి కొత్త యాంకర్లు పరిచయం అయ్యారు – ఈ జబర్దస్త్ షో ద్వారా యాంకర్లు అనసూయ, రష్మీ లకు మంచి పేరొచ్చింది.  కన్నడ అమ్మాయి సౌమ్య రావు, సిరి కూడా ఈ జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా పరిచయమయ్యారు

ఇండస్ట్రీ కి కొత్త కమెడియన్స్, నటులు, దర్శకులు పరిచయం అయ్యారు – ఈ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పేరు తెచ్చుకున్న వేణు (Venu), ధన్ రాజ్ లు దర్శకులు అయ్యారు.  వేణు బలగం (Balagam) వంటి సూపర్ హిట్ సినిమా తీశారు.  ధన్ రాజ్ రామం రాఘవం వంటి సూపర్ హిట్ సినిమా తీశారు.

సుడిగాలి సుధీర్ హీరో గా గాలోడు, సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్, వాంటెడ్ పండుగాడు,  కాలింగ్ సహస్ర వంటి సినిమాలు చేశారు. సుడిగాలి సుధీర్ కి అయితే కర్ణాటక లో కూడా మంచి ఫాలోయింగ్ ఉందండోయ్.   హీరోగానే కాకుండా అనేక సినిమాలలో చిన్న చిన్న పత్రాలు వేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.  సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) , రష్మీ (Rashmi) కెమిస్ట్రీ కి అభిమానులు ముగ్దులయిపోయారు

ఈ షో ద్వారా ఈటీవీ, మల్లెమాల సంస్థలు షకలక శంకర్, బుల్లెట్  భాస్కర్, నరేష్, రచ్చ రవి, చమ్మక్ చంద్ర,, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్,  రాకెట్ రాఘవ, వర్ష, శ్రీదేవి, కెవ్వు కార్తీక్, హైపర్ ఆది, ముక్కు అవినాష్, కిరాక్ ఆర్పీ, అభి, షాకింగ్ శేషు, వెంకీ, రాకింగ్ రాకేష్, సునామి సుధాకర్, తాగుబోతు రమేష్, తిరుపతి ప్రకాష్, రైజింగ్ రాజు, నూకరాజు, అప్పారావు, ఫైమా, శాంతి, చలాకి చంటి  వంటి ఎంతో మంది టాలెంటెడ్ కమెడియన్, నటులు, రచయితలు, దర్శకులను ప్రపంచానికి తెలియచేసింది ఈటీవీ యాజమాన్యం మరియు మల్లెమాల సంస్థలు.  12 సంవత్సరాలలో ఎంతో మందికి జీవితాన్ని ప్రసాదించింది. అందరూ సొంత ఇల్లు, కారు కొనుక్కున్నామని చెప్పారు కూడా

అంతే జడ్జిలుగా నాగబాబు(Nagababu) , రోజా (Roja) ఎంతో పేరు సంపాదించారు.  ముఖ్యంగా నాగబాబు నవ్వుకు ఈ జబర్దస్త్ షో ఎంతో పేరు తెచ్చింది. కల్మషం లేకుండా, చిన్నపిల్లాడిలా నాగబాబు నవ్వుతుంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.  ఈ కార్యక్రమానికి జడ్జి లుగా మనో, ఇంద్రజ, కుష్బూ, శివాజీ, కృష్ణ భగవాన్ లు కూడా వ్యవహరించారు.

ఒకప్పుడు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో లు 8 రేటింగ్ పాయింట్ లను సాధిస్తూ ఉండేది.

అంతే కాకుండా ఈ జబర్దస్త్ షో సక్సెస్ కావడం ద్వారా ఢీ అనే డాన్స్ షో ని కూడా కొత్త పుంతలు తొక్కించారు.  అంతే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షో అవతరించింది.  అంతే కాకుండా ప్రతి పండగకు ఆహ్లాదకరమైన పండగ వాతావరణం వచ్చింది

అయితే ఈ వారం జరిగిన 12 సంవత్సరాల సెలెబ్రేషన్స్ లో సుడిగాలి సుధాకర్, రోజా కనపడలేదు. రోజా రాకపోవడానికి కారణం, నాగబాబు రావడం కావచ్చు.  రాజకీయ పార్టీ పరంగా విభేదాలే కారణం కావచ్చు.

అయితే ఈ జబర్దస్త్ షో మీద కొన్ని విమర్శలు లేకపోలేవు.  డబల్ మీనింగ్ జోక్స్ మరి ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఉంటాయని కొన్ని విమర్శలు ఉన్నాయి.

ఏది ఎలా ఉన్న ఒక టెలివిజన్ షో 12 సంవత్సరాలుగా నడపడం, సామాన్యులను సెలెబ్రిటీలను చేయడం, ఎంతో మందికి జీవితాలను ప్రసాదించడం, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం ఇవన్నీ ఒక్క ఈటీవీ కే సాధ్యం.  ఈ విషయం లో ఈటీవీ (ETV) యాజమాన్యం వారిని, మల్లెమాల (Mallemala) సంస్థని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి (Shyam Prasad Reddy) గారి ని అభినందించవలసిందే.