కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ – తన ఉనికిని కోల్పోతోందా? కేంద్ర ప్రభుత్వం 71 వ జాతీయ చలన చిత్ర పురసకారాలను 2023 సంవత్సరానికి ప్రకటించింది. అయితే ఈ మధ్య, జాతీయ చలన చిత్ర పురస్కారాలు పలు వివాదాలకు తావిస్తోంది.
ఈ అవార్డు లలో భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాకి జాతీయ అవార్డు లభించింది. ఇందులో ఆడవాళ్లు తన కాళ్ళమీద తాము నిలబడాలి, గుడ్ టచ్, బాడ్ టచ్ వంటి అంశాలు చెప్పడం వలన జాతీయ అవార్డు లభించింది. అయితే ఈ సినిమాలో గుడ్ టచ్, బాడ్ టచ్ అనేది ఒక చిన్న సన్నివేశం గా చూపించారు. ఆడవాళ్లు తమ కాళ్ళ మీద తాము నిలబడాలి అనేది కూడా అంత స్ట్రాంగ్ గా ఏమి చూపించాలి. ఈ సినిమాలో టిపికల్ బాలకృష్ణ (Bala Krishna) మాస్ అంశాలతోనే తీశారు.
బలగం (Balagam) సినిమాకు అన్యాయం జరిగిందా
జాతీయ అవార్డు ల కమిటీ కి బలగం సినిమా కనిపించలేదా. బలగం సినిమాలో ఊరు పల్లెటూరు సినిమా రాసిన కాసర్ల శ్యామ్ గారికి అవార్డు వచ్చినందుకు సంతోషం. ఆ పాట నిజంగా ఒక అద్భుతం. ప్రతి లైన్ కు మంచి అర్ధం ఉంది. ఆ పాటలాగా, సినిమా కూడా అద్భుతం. నేషనల్ అవార్డు కి బలగం సినిమాకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి.
సహజత్వానికి దగ్గరగా, ఉమ్మడి కుటుంబాల విలువలను చాటి చెపుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతి బింబంలా, చావు కూడా సెలెబ్రేట్ చేసుకోవాలి అని చెపుతూ వచ్చిన సందేశాత్మక చిత్రం బలగం. ఈ సినిమా అవార్డుల కమిటీకి అర్ధం కాలేదా, నచ్చలేదా. చాలా రోజుల తరవాత గ్రామీణ ప్రాంతాలలో ఈ సినిమాను బళ్ళు కట్టుకుని మరి వెళ్లి చూసొచ్చారు. అంతే కాకుండా బలగం సినిమాకు అనేక అవార్డులు కూడా వచ్చాయి
గత సంవత్సరం స్మగ్లర్ ని హీరోగా చూపిస్తూ, పోలిసుల ను వెధవలు చేసిన పుష్ప (Pushpa) సినిమాకు అవార్డు ఇచ్చారు. ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) నటన క్యారెక్టర్ ను బట్టి ఉండే తప్ప అంత అసాధారణంగా అయితే ఏమి లేదు. అవార్డు ల కమిటి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుని పుష్ప (Pushpa) లాంటి సినిమాలకు అవార్డులు ఇచ్చిందో ఆ కమిటీకి మాత్రమే తెలియాలి.
ఇంతే కాదండోయ్ బేబీ (baby) చిత్రానికి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. బేబీ సినిమాలో కొన్ని సంభాషణలు వ్యావహారిక భాషలో వాడనివి, వాడకూడనివి ఉన్నాయి. అంతే కాకుండా సమాజం మీద ప్రభావం చూపే అంశాలు ఉన్నాయి. అలాంటి సినిమాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది.
పుష్ప, బేబీ వంటి సినిమాలతో సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది నేషనల్ ఫిలిం అవార్డ్స్ కమిటీకే తెలియాలి
ఉత్తమ నటుడు అవార్డు అవార్డు షారుఖ్ ఖాన్ కి దక్కింది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మటు సినిమా అయిన జవాన్ లో షారుఖ్ నటన కన్నా అనిమల్ లో రణభీర్ కపూర్ కి ఇవ్వచ్చు. కధ ఎలాంటిది అయినా, అసభ్యకర పదాలు, సన్నివేశాలు ఉన్నా నటనకే ప్రాధాన్యమిస్తే, రణభీర్ కపూర్ కి ఇవ్వాలి. ఆలా కాకుండా షారుఖ్ ఖాన్ కి వచ్చింది
పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడ జీవితం) సినిమా కూడా అవార్డుల కమిటీకి నచ్చలేదేమో. పృథ్వీ రాజ్ సుకుమారన్ నటన కూడా నచ్చలేదేమో.
కేవలం 11-13 మంది సభ్యులున్న కమిటీ జాతీయ అవార్డులను డిసైడ్ చేస్తోందంటే, ఆ కమిటీ సభ్యులకి సినిమా నచ్చితేనే అవార్డు వస్తుంది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ కన్నా నేషనల్ కమిటీ వారి అవార్డ్స్ అని పేరు పెడితే బావుంటుందేమో
అయితే ఈ లెక్కన పుష్ప 2 (Pushpa 2) సినిమా కి జాతీయ అవార్డు లు ఆశించవచ్చు. గోల్డ్ వాచ్ ల స్మగ్లింగ్ మీద రాబోయే కూలీ (Coolie) సినిమా కి భవిష్యత్తులో జాతీయ అవార్డు లు వచ్చిన ఆశ్చర్య పోనక్కర్లేదు. ఇక అవార్డు లు గురించి ఆలోచించనవసరం లేదేమో. ఒక ఐఫా, ఒక ఫిలిం ఫేర్, ఒక సైమా, ఒక నేషనల్ ఫిలిం అవార్డ్స్ (National Film Awards). గుంపులో గోవిందం, మన కేంద్ర ప్రభుత్వం అవార్డుల కమిటీ ఇచ్చే నేషనల్ ఫిలిం అవార్డ్స్.

