చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. చైనాలోని హువాజియాంగ్ గ్రాండ్ కేనియన్ వంతెన ఈ సంవత్సరం ప్రారంభం కానుంది, ఇది 2050 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన వంతెనగా నిలిచింది.
వంతెన యొక్క ఇటీవలి ఫుటేజ్ విడుదలైంది, సిబ్బంది తుది మెరుగులు దిద్దుతున్నట్లు చూపిస్తుంది.
2022 లో ఈ వంతెన నిర్మాణం ప్రారంభించారు. 2025 లో ఓపెన్ అవుతుంది. అంటే కేవలం మూడు సంవత్సరాలలో దీనిని నిర్మించారు. ఈ వంతెన దాదాపు ఒక మైలు పొడవు మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెన కంటే తొమ్మిది రెట్లు ఎత్తులో ఉంది.
ఈ వంతెన డ్రైవర్ల ప్రయాణ సమయాన్ని గంట నుండి నిమిషానికి తగ్గిస్తుంది. దీని ధర దాదాపు $280 మిలియన్లు. అంటే మన భారత దేశ కరెన్సీ ప్రకారం 2400 కోట్లు
ప్రస్తుతం సోషల్ మీడియా లో దీనికి సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2025 జూన్ లో ఈ వంతెనని ప్రారంభించనున్నారు భారీ నిర్మాణాలకు చైనా పెట్టింది పేరు. ప్రపంచంలో ఎత్తయిన 100 వంతెనల్లో 50 చైనా లోనే ఉంటాయి అంటే అతిశయోక్తి కాదు.

