10.1 ఓవర్లలో ఛేదన ; కోల్ కతా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీ

by | Apr 12, 2025 | వార్తలు

కుప్పకూలిన చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ లైన్ అప్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది

104 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ కు ఓపెనర్లు డి కాక్, సునీల్ నరైన్ లు మొదటి వికెట్ కు 4.1 ఓవర్ల లో 46 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు

23 పరుగులు చేసిన డి కాక్ అవుట్ అయిన తరవాత వచ్చిన కెప్టెన్ రహానే తో కలిసి మరో ఓపెనర్ సునీల్ నరైన్ 39 పరుగులు జోడించాక నరైన్ అవుట్ అయ్యాడు. సునీల్ నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లో 44 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు

ఆ తరవాత వచ్చిన రింకు సింగ్, రహానే లు మరో వికెట్ పడకుండా కోల్ కతా నైట్ రైడర్స్ ను గెలిపించారు.  రహానే 20 పరుగులు, రింకు సింగ్ 15 పరుగులతో అజేయంగా నిలిచారు

కోల్ కతా నైట్ రైడర్స్ 10.1 ఓవర్ల లో రెండు వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంకా 9.5 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో కాంబోజ్, నూర్ అహ్మద్ లు చెరో ఒక వికెట్ తీశారు.  బ్యాటింగ్, బౌలింగ్ లోను రాణించిన సునీల్ నరైన్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది

ధోని కెప్టెన్ అయినా చెన్నై సూపర్ కింగ్స్ తలరాత మారలేదు. వరస పరాజయాలు వెంటాడుతున్నాయి

అంతకు ముందు టాస్ గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది

మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్ల లో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది

ఇన్నింగ్స్ ప్రారంభించిన దగ్గర నుంచి చెన్నై సూపర్ కింగ్స్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో మూడవ వికెట్ కు విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి లు నెలకొల్పిన 43 పరుగులే అత్యుత్తమ భాగస్వామ్యం

31  పరుగులు చేసిన శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్. విజయ్ శంకర్ 29 పరుగులు, కాన్వే 12 పరుగులు, రాహుల్ త్రిపాఠి 16 పరుగులు, చేసి అవుట్ అయ్యారు

మిగతా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు ఎవరు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు సరి కదా, రవీంద్ర జడేజా, దీపక్ హుడా లు డక్ అవుట్ అయ్యారు. 7 నుండి 15 ఓవర్ల మధ్య 43 పరుగులకు 5 వికెట్ లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్

కోల్ కతా నైట్ రైడర్స్ బౌలర్ల లో సునీల్ నరైన్ మూడు వికెట్ లు తీయగా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి లు రెండేసి వికెట్లు తీశారు. వైభవ్ అరోరా, మొయిన్ అలీ లు చెరో ఒక వికెట్ తీశారు