‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ జోరు – డే 1 ఎంత వసూలు చేసిందంటే?

by | Apr 11, 2025 | సినిమా

కోలీవుడ్ సీనియర్ కథానాయకుడు అజిత్ కుమార్‌ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం అందించారు. ఇందులో త్రిష (Trisha) హీరోయిన్ గా నటించగా.. సునీల్, ప్రసన్న, యోగిబాబు, రాహుల్‌ దేవ్‌, అర్జున్‌ దాస్‌, ప్రభు ఇతక ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందించారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవగా.. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకోని బాక్సఫీస్ దూసుకుపోతోంది.

ఈ క్రమంలోనే సాలిడ్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ రికార్డ్ సాధించాడు. ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రూ.30.9 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. దింతో అజిత్ (Ajith) ఈ సినిమాతో తన గత చిత్రాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్ సాధించాడు. వీకెండ్ తో పాటుగా వరుసగా సెలవులు రావడంతో ఈ మూవీ లాంగ్ రన్ లో భారీగా వసూళ్లు సాధించే అవకాశముంది. కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ రూ. 280 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్‌కు మంచి ధరకు అమ్ముడయ్యాయి. వరల్డ్ వైడ్ గా గుడ్ బ్యాడ్ అగ్లీకి (Good Bad Ugly) రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఇవేన్ సాధించాలంటే ప్రపంచ వ్యాప్తంగా బాక్సఫీస్ వద్ద రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది.