గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చిత్ర యూనిట్ మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయగా.. అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరామినవమి కానుకగా ‘పెద్ది’ నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్ విడుదల చేయగా.. ఈ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు విడుదలైన సినిమాల గ్లింప్స్‌లో ఎన్టీఆర్ (NTR Devara) దేవర మూవీ గ్లింప్స్ 26.17 మిలియన్ల వ్యూస్ తో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా పెద్ది సినిమా గ్లింప్స్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. విడుదలైన 24గంటల్లోనే ఏకంగా 33 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక తెలుగులో పెద్ది గ్లింప్స్ అగ్రస్థానంలో ఉండగా.. దేశవ్యాప్తంగా టాక్సిక్ మూవీ 36 మిలియన్లతో అగ్ర స్థానంలో ఉంది. తెలుగులో పెద్ది (Peddi) గ్లింప్స్ 33 మిలియన్లతో తొలి స్థానంలో ఉండగా.. ఎన్టీఆర్ దేవర మూవీ 28.7 మిలియన్లతో రెండో స్థానంలో.. అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప2 మూవీ 27.11 మిలియన్లతో మూడో స్థానంలో పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ 27 మిలియన్లతో నాలుగో స్థానంలో ప్రభాస్ కల్కి మూవీ 23.16 మిలియన్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇక పెద్ది సినిమా 2026 మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ కాబోతుందని గ్లింప్స్‌లో ప్రకటించారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు

