ఇండియా లో నెంబర్ వన్ హీరోయిన్ సమంత

by | Apr 7, 2025 | వార్తలు

ఆర్మాక్స్ మీడియా నిర్వహించే మోస్ట్ పాపులర్ ఫిమేల్  ఫిలిం స్టార్స్ ఇన్ ఇండియా సర్వే ఫిబ్రవరి 2025 జాబితా విడుదలయింది

ఈ జాబితా లో సమంత  నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు.  రెండవ స్థానంలో అలియా భట్, మూడవ స్థానంలో దీపికా పదుకునే ఉన్నారు.

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నాలుగవ స్థానంలో ఉన్నారు.  సినిమాలు ఏమి లేకపోయినా కాజల్ అగర్వాల్ ఐదవ స్థానంలో ఉన్నారు. వరుస పెట్టి ఇండస్ట్రీ హిట్ లు ఇస్తున్న రష్మిక మందన మాత్రం ఆరవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ఏడవ స్థానంలో 40 ఏళ్ళ వయసులోకూడా తన అండ చందాలతో ఆకట్టుకుంటోన్న త్రిష ఉండగా, లేడీ సూపర్ స్టార్ టాగ్ వద్దన్నా నయనతార ఎనిమిదవ స్థానంలో ఉన్నారు

వరుస ప్లాప్ లు పలకరిస్తున్న శ్రీ లీల 9 వ స్థానంలో ఉంటె, ఘాటీ తో మన ముందుకు రాబోతోన్న అనుష్క శెట్టి పడవ స్థానంలో ఉన్నారు

టాప్ టెన్ జాబితాలో ఉన్న 10 మందిలో బాలీవుడ్ కు చెందిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు.  ఒకరు అలియా భట్ మరొకరు దీపికా పదుకునే. మిగతా ఎనిమిది మంది దక్షిణాదికి చెందిన కథానాయికలు కావడం విశేషం. సినిమాలు ఏమి లేకున్నా కేవలం వెబ్ సిరీస్ లు చేస్తోన్న సమంత నెంబర్ వన్ స్థానంలో ఉండడం గమనార్హం