బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. ‘అఖిల్ 6’ ప్రీ లుక్ రిలీజ్

by | Apr 7, 2025 | సినిమా

టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్‌‌ గతంలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నటించిన ‘ఏజెంట్’ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆయన నటించిన ఏ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో.. అఖిల్‌ తదుపరి సినిమా మీదే ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్‌ కిరణ్‌ మురళీకిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రానికి ‘లెనిన్’ (Lenin) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గ్రామీణ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. సోషల్‌ మీడియా ద్వారా ఈ సినిమా ప్రీ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తూ.. కొత్త అప్‌డేట్‌ అందించారు మేకర్స్. ఈ చిత్రం టైటిల్ తో పాటుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఏప్రిల్‌ 8న అఖిల్ (Akhil) పుట్టినరోజు కానుకగా లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఈ ప్రీ లుక్ పోస్టర్లో ఫేస్ సరిగా చూపించకపోయినా అది అఖిల్ చెయ్యి అని అర్థమయ్యేలా ప్రీ లుక్ పోస్టర్ను డిజైన్ చేశారు. చాలా కొత్తగా కనిపిస్తున్న ఈ లుక్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ అప్డేట్ చూస్తుంటే అఖిల్ పుట్టిన రోజు నాడు అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఓ గ్రాండ్ ట్రీట్ కి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దింతో అక్కినేని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. రాయలసీమ నేపథ్యంలో పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అధికభాగం చిత్తూరు జిల్లాలో షూటింగ్‌ చేస్తారట. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.