సల్మాన్ కు అవమానం ; ‘సికందర్’ కలెక్షన్స్ భారీగా డ్రాప్!

by | Apr 2, 2025 | సినిమా

బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్, కోలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగదాస్, కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సికందర్'(Sikandar). జై హో చిత్రం త‌ర్వాత మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబోలో ఈ సినిమా రావడంతో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈద్ కానుకగా ఆదివారం (మార్చి 30) థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే విడుదలైన ప్రతీ చోట ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో బాక్సఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రావడంలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు బాక్సఫీస్ వద్ద రూ.26 కోట్ల మేర వసూళ్లు సాధించిన ఈ సినిమా రంజాన్ సందర్బంగా రెండో రోజు రూ.29 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక మూడో రోజు రూ.21 కోట్లు కలెక్షన్ రాబట్టింది. అలా ఇ‍ప్పటివరకు రూ.75.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తోంది.

నిజానికి స్టార్ హీరోల సినిమాలు మొదటి మూడు రోజుల్లోపే రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుంటాయి. కానీ ‘సికందర్’ సినిమాకు మాత్రం ఊహించని స్థాయిలో కలెక్షన్స్ డ్రాప్ అవుతున్నాయి. ఇదే అనుకుంటే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న చాలాచోట్ల వసూళ్లు తగ్గడంతో షోలు కూడా క్యాన్సల్ అవుతున్నాయని తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే ‘సికందర్’ సినిమాకు రూ.100 కోట్ల క్లబ్ లో ఈ వీకెండ్ ముగిసేసరికి అయినా చేరుతుందా అనేది అనుమానంగా మారింది. ఇక సికిందర్ సినిమాను రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. ఈ మూవీలో సల్మాన్కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించింది. సత్యరాజ్‌, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.