33 ఏళ్ళ క్రితమే టైం మిషన్ ని కనిపెట్టిన దర్శకుడు

by | Apr 2, 2025 | సినిమా

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘ఆదిత్య 369’ (Aditya 369). జూలై 18, 1991లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది.

ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా 4K తో డిజిటలైజ్ చేసి 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలోనే ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 4 న రీ రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్, ఆదిత్య 369 రి రిలీజ్ కు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు

ఈ క్రమంలో ఆదిత్య 369 గురించి దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఏం చెప్పారో తెలుసుకుందాం

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ ఫస్ట్ ఇండియన్ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాకి సీక్వెల్‌ ఉంటుందని, బాలయ్య గతంలోనే పలు సందర్భాల్లో చెప్పారు. ఇందులో బాలయ్య సరసన మోహిని హీరోయిన్ గా నటించగా.. సిల్క్ స్మిత, అమ్రిష్ పురి, టినూ ఆనంద్, మాస్టర్ తరుణ్, జేవీ సోమయాజులు, సుత్తివేలు, లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు ఇళయరాజా  సంగీత స్వరాలు అందించారు. ఇందులో శ్రీ కృష్ణదేవరాయలుగా నందమూరి బాలకృష్ణ నటన..  జంధ్యాల సంభాషణలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్ళాయి.