గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా, షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది.
అయితే ఈ సినిమా గ్లింప్స్ వీడియోను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ‘పెద్ది’ (Peddi) గ్లింప్స్ థియేటర్స్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ ఏప్రిల్ 6న గ్లింప్స్ రిలీజ్ అయ్యాక ఏప్రిల్ 10న థియేటర్స్ లో విడుదల కాబోతున్న మైత్రి మూవీ మేకర్స్ సినిమాలు ‘జాట్’ అలాగే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాలతో కలిసి థియేటర్లలో స్క్రీనింగ్ కాబోతుందని ఫిలింనగర్ సర్కిల్ ఇన్సైడ్ టాక్. దింతో ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. కాగా, పెద్ది మూవీ మ్యూజిక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ సంస్థ టీ సిరీస్ భారీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పెద్ది ఆడియో రైట్స్‌ను టీ సిరీస్ రూ.25 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దింతో రామ్‌చరణ్ (Ram Charan) కెరీర్లో అత్యంత భారీ స్థాయిలో మ్యూజిక్ రైట్స్ అమ్ముడైన చిత్రంగా ‘పెద్ది’ రికార్డ్ సాధిస్తుంది. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

