రీసెంట్ బ్లాక్‌ బస్టర్‌ ‘కోర్ట్’.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

by | Apr 1, 2025 | సినిమా

నేచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కోర్ట్’. స్టేట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డీ అనేది ఉప‌శీర్షిక‌. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్ర‌శాంతి త్రిపిరినేని నిర్మించారు. హోలీ కానుకగా మార్చి 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్​ దక్కించుకుంది. చిన్న సినిమాగా మొద‌లై పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం థియేటర్లలో అదరగొట్టేసింది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.57 కోట్లకు పైగా వసూళ్లతో సెన్సేషనల్ రికార్డు సృష్టించింది. సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఓ రేంజ్‌లో అభిమానులను అలరించింది. ఇక సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ సినిమా ఇక ఓటీటీలో సందడి చేసే టైం కూడా వచ్చేసిందంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.. కోర్ట్ (Court) మూవీ 2025 ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందన్న వార్త వైరల్ అవుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, ‘కోర్ట్’ (Court) మూవీ డిజిటల్ రైట్స్ ను దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’ (Netflix) రూ.9 కోట్లకు దక్కించుకోగా.. విడుదలైన సరిగ్గా నెలరోజుల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. మరి హీరో నాని నిర్మించిన ఈ చిత్రానికి స్మాల్ స్క్రీన్ మీద ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. ఇక మరోవైపు పెద్దగా కమర్షియల్ అంశాల్లేకుండా కంటెంట్ కి కట్టుబడి తీసిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలోనే విడుదలైన 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. అయితే కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇక్కడే కాకుండా ఓవర్సీస్​లోనూ సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా సూపర్ స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తుండడం విశేషం. ఈ సినిమాలో ప్రియ‌ద‌ర్శి ప్ర‌ధాన పాత్ర‌ పోషించారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇందులో శివాజీ, హర్షవర్ధన్, సాయి కుమార్, రోహిణి కీలక పాత్రల్లో నటించారు.