ఉగాది సందర్భంగా రామానాయుడు స్టూడియోలో చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందనున్న ఈ క్రేజీ మూవీని పూజా కార్యక్రమంతో ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. ‘మెగా157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
కాగా , ఈ సినిమా కోసం పని చేయనున్న వారి వివరాలను షేర్ చేసుకుంటూ ఒక వీడియో షేర్ చేశారు మెగా స్టార్ చిరంజీవి. ఇప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలలోని పాత్రల పేరు చెపుతూ వారు చేయబోతున్న పని గురించి వివరించారు. ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దామ్ అని వీడియో చివర్లో చిరు చెప్పిన డైలాగు కు ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతున్నట్లు తెలిపారు. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి
ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలైంది. ఈ చిత్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాలీవుడ్ అగ్ర కథనాయకుడు విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు.

