గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘ఆర్‌సీ16’ వర్కింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కాగా, కుస్తీతో పాటు క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఇటీవలే చిత్ర బృందం మెగా అభిమానులకు అదిరిపోయే కానుక అందించింది. మార్చి 27న హీరో రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ‘ఆర్సీ 16’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ క్రమంలోనే రామ్ చరణ్ (Ram Charan) ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. లాంగ్ హెయిర్ స్టెల్‌తో.. రగ్గ్‌డ్ గడ్డంతో, ముక్కుకు రింగుతో సిగరెట్ వెలిగిస్తూ.. డాషింగ్ లుక్‌లో రామ్‌చరణ్ కనిపించారు.
తాజాగా ‘పెద్ది’ (Peddi) చిత్రానికి సంబంధించిన మరో క్రేజీ అప్ డేట్ అందించారు మేకర్స్. ఆదివారం ఉగాది పండగ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాలోని రామ్‌చరణ్ నయా లుక్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. ఈ సినిమా గ్లింప్స్ వీడియోను శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ లో జెండాలు పట్టుకొని కొందరు పైకి చూస్తుంటే వారి మధ్యలోకి రామ్ చరణ్ దూకుతూ కనిపిస్తున్నాడు. ఇక పెద్ది మూవీ గ్లింప్స్ రిలీజ్ డేట్ రావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్, దివ్యేండు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

