అల్లు అర్జున్- అట్లీ సినిమా ముహూర్తం తేదీ ఫిక్స్‌!

by | Mar 30, 2025 | సినిమా

పుష్ప‌2 సినిమాతో కెరీర్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లని ఓకే చేశాడు. ఇందులో త్రివిక్ర‌మ్‌తో ఓ సినిమా చేయనుండగా, తమిళ డైరెక్టర్ అట్లీతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అల్లు అర్జున్‌- అట్లీ కాంబినేషన్ లో హై యాక్షన్‌ మూవీ తెరకెక్కించనున్నట్లు తెలుస్తుండగా.. అట్లీ అల్లు అర్జున్ కోసం చాలా స్పెషల్ గా ఈ పాత్రని డిజైన్ చేస్తున్నాడట. దీని ప్రకారం ఈ చిత్రం ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) ఈ సినిమాను నిర్మించనుండగా.. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్ తో పాటుగా ఐదుగురు హీరోయిన్స్‌ ఉంటారని, వీరిలో ముగ్గురు ఫారెన్ హీరోయిన్లు ఉండనున్నారని అంటున్నారు. అయితే ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా అనౌన్స్ మెంట్ డేట్ ఇప్పటికే ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్ (Allu Arjun) – అట్లీ కాంబోలో తెరకెక్కనున్న సినిమాను ఈ ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఈ సందర్భంగా మూవీ అనౌన్స్మెంట్ తో పాటుగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ ఏడాదితో 22 ఏళ్లు పూర్తి కానుండగా.. అట్లీతో చేయనున్న సినిమా కూడా బన్నీ కెరీర్‌లో 22వ చిత్రం కావడం విశేషం. దాంతో అల్లు అర్జున్ ఈ సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బన్నీ పుట్టినరోజు నాడే త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. కాగా, అట్లీతో చేయనున్న సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun) డ్యూయల్‌ రోల్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. హీరో కమ్ విలన్ గా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని సమాచారం. సింపుల్ లుక్ లో హీరో పాత్ర ఉండనుండగా.. రెండో పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్స్ తో ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ‘పుష్ప 2’లో పుష్ప రాజ్ తరహా లుక్ లో ఇందులో నెగెటివ్ పాత్ర ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఇప్పటికే అల్లు అర్జున్ విదేశాలకు వెళ్ళి మరీ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తునందుకు గానూ బన్నీ ఏకంగా రూ.175 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇక పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో కీలకమైన పాత్రలో తమిళ స్టార్ హీరో అమరన్ ఫేమ్ శివకార్తికేయన్ నటించనున్నట్లు తెలుస్తోంది